Posts

Showing posts from December, 2018

నాన్న

Image
తొలినడకన తడబడినడుగుకు దొరికినతోడు నాన్న ఒడి ఊయలగా చేసి నిద్రపుచ్చే వెన్నెల నాన్న అనుక్షణం ఓటమితో చిరునవ్వు దూరమవుతుంటే భయపడకు నేనున్నాననే భరోసా నాన్న పైకినవ్...

మగాడు

Image
మగాడిగా పుట్టినందుకు "గర్వించు".. మృగంలా కాకుండా మగాడిలా "జీవించు".. నీ పుట్టుక నుండి చచ్చేవరకు నీకు తోడుగా ఉండే ఆడదాని విలువ "గుర్తించు".. మళ్ళీ జన్మంటూ ఉంటే నిన్ను కన్న...

మగువ

Image
పుట్టింట్లో తానో బంగారుబొమ్మ అత్తారింటికి చేరగానే అయింది ఆటబొమ్మ ఎన్నో ఆశలతో కావాలనుకున్న జీవితం బ్రతుకంతా అయింది విషాదం ఎవరికి చెప్పుకోలేక.. ఏమి చేయలేక.. తనలో ద...

ఆడపిల్ల

Image
కల్లోల కడలి నా మనసు.. కనిపించని అలజడి ఎవరికి తెలుసు.. కష్టాలు,కన్నీళ్లే కలిగించెను వయసు.. అయినా.. ఈ లోకానికి నేనే అలుసు😭 -నందన✍

రైతు

Image
కలం కదులుతోంది భారంగా కన్నీటి సిరాను నింపుకుని😐 కాలం కరుగుతోంది వేగంగా కానరాని ఆశలను పరచుకొని😕 బలంలేని శరీరాన్ని,బలహీనమైన నమ్మకాలను పోగేసుకుని.. హలం పట్టిన రైతన...

నా కలం

Image
ఆవేశపు సిరాను నింపుకుని.. అక్షరపు ఆయుధాలను సంధిస్తూ.. వడివడిగా పరిగెడుతుంది నాకలం.. "బలహీనుడికి బలం అవ్వడానికి.. బలవంతుడి బలాన్ని నిలదీయడానికి" -నందన✍

కన్నీరు

Image
అత్తింట్లో కష్టమొచ్చిందంటే.. తప్పదు పోరాడాలి ఓపికతో ఎదురుచూడాలి వాళ్లే మారతారు అంటారు.. కానీ.. ఎన్నాళ్లీ పోరాటం.. అతివ పాడెక్కి అంతిమయాత్ర వరకా? అన్నిట్లో నాగరికత సా...

స్త్రీ

Image
అతివవైనా,సీతవైనా.. నీ శోకానికి అశోకవనమేది? అమ్మవైనా,ఆలివైనా.. కన్నీటమునగని జీవితమేది? కడుపులో పసికందుకి కూడా వెలుగు చూడని తలరాతలు😕 నువ్వు పుడమితల్లిలా భరించగలవనే...

అమ్మ

Image
తన వ్యధను చెప్పాలంటే అదో అంతులేని "కథ" 😊 తన ఓర్పు తూచాలంటే సరిపోదు "వసుధ"🙏 తన త్యాగం నింగికి,నేలకు మధ్య "దూరమంత"❤ అందుకే.. అమ్మ మనసు సముద్రం "లోతంత"😘 అమ్మప్రేమ ❤ -నందన✍

ఆడపిల్ల

Image
ఆడపిల్లే కదా అవనిని అలుముకునే అందమైన "తరువు"☺ ఆచరణలో పెడితే తానే పుడమికి అసలైన "పరువు"😊 ఆకాశమంత ప్రేమని పరుచుకున్న విలువైన "బరువు"😕 అవకాశాలెన్నో ఉన్నా నిత్యం తనలో కొ...

వేదన

Image
నిన్ను నన్ను కలిపిన నిన్నని నిందించాలా.. కన్నుమిన్ను కానని ఆ మొన్నాను ద్వేషించాలా.. ఇకపై నువ్వు నాతో లేవని నన్ను నే దూషించాలా.. ఆశలేని రేపు వైపు నా పయనం సాగించాలా.. లేక.. నా జీవితాన్ని ముగించాలా😭 -నందన✍

😒

నిన్నలోని నిన్ను తలచుకుంటూ.. నేడు నీ జ్ఞాపకాలు మోసుకుంటూ.. ఆశలేని రేపు వైపు అడుగులేస్తున్నా... -నందన✍

❤❤

Image
ఒకే ఒక్క క్షణం చాలుగా.. ప్రతి కల నిజం చేయగా.. యుగాలు గల కాలమా.. ఇలాగే నువ్వాగుమా😘 దయుంచి ఆ దూరమే.. ప్రేమతో నా దరి చేరుమా😍 -నందన✍

ఆత్మవిశ్వాసం

స్థాయేమో భూమి మీద నిల్చునేలా చేస్తుంటే.. ఆశేమో ఆకాశంలో ఎగరాలని చూస్తుంది.. ఆత్మవిశ్వాసమనే నిచ్చెన వేసుకుని.. ఆశగా చూస్తున్న ఆకాశాన్ని అందుకో.. నీ సంకల్పం గొప్పదైతే అ...

బంధం❤

ఏ పరిచాయనికేం ఫలితముందో తెలుపుమా.. అది ఆ క్షణాన తెలుసుకోవడం సాధ్యమా.. స్నేహమా..చెప్పుమా...😍

😐😐

ప్రతిక్షణం నీకై తపించే.. నా మనసుకేం తెలుసు.. ఈ క్షణం నువ్వు నాకు దూరమౌతావని.. నేనిలా ఒంటరినైపోతానని.... -నందన✍

మనసు

నా గుండె గోడపై .. నా ప్రేమ కుంచెతో.. ఒక చిత్రం గీ శా.. నీ మనసు తో చూడు కనిపిస్తుంది...         -నంద న✍

అమ్మ

Image
తన ఒడినే గుడి చేసి.. తొమ్మిది నెలలే మోసి.. మరణాన్ని సైతం ఎదిరించి.. నీకో రూపాన్నిచ్చి.. లాలించి,పాలించి.. మురిపించి నిన్ను గుండెల్లో పెట్టుకుని కంటికి రెప్పలా కాచే దైవం ...

స్ఫూర్తి..

ఎప్పుడోపోయే ప్రాణానికి ఇప్పటినుండే చేతకాని చితులు పేర్చడమెందుకు మెదడుకు పట్టిన చీడను విదిల్చి చూడు చేవజచ్చిన చోట జీవం తెచ్చుకుచూడు శిశిరంలో రాలిపోయిన ఆకు వసంత...

పెళ్లంటే...

Image
బరువో,బాధ్యతో తెలియదు కాని పెళ్లిచేసి బిడ్డను అప్పజెప్పి చీరెసారెలతో సాగనంపి గుండెబరువుపోయిందని ఊపిరి పీల్చుకుంటారు కొందరు తర్వాత "బాగున్నావామ్మా" అని ధైర్యం...

కన్నీరు

ఒకరిని మిస్ అవుతున్నప్పుడు వచ్చే కన్నీటికన్నా.. జీవితంలో ఇక ఎప్పటికి కలవలేమేమో అనే బాధతో వచ్చే కన్నీళ్లు ఎంతో భారమైనవి.. భరించలేనివి😕        -నందన ✍

ఆడపిల్ల

Image
"హనుమంతుడు" లంకాదహనం "లక్ష్మణుడికి" ప్రాణం మీదకు రావడం "విభీషణుడు" ఇంటిగుట్టు చెప్పడం "రావణాసురుడు" చావడం "రాముడు" చంపడం ఇవన్నీ "సీత"గీతదాటడం వల్లే వచ్చాయి.. అందుకే... నువ్వు "సీత"లా జీవించు.. కానీ.. కన్నవాళ్ళు గీసిన "గీత"ను మాత్రం దాటకు.. "గీత" దాటి కన్నవాళ్ళ మనసు కష్టపెట్టకు😐            -నందన✍