బంధం

నచ్చావన్న ఒకే ఒక్క మాటతో..
నీ ముందు తలవంచి మూడుముళ్ళు వేయించుకుని..
నీ దానిగా..
నీ తోడై ఉంటానని..
అందరిని కాదని..
నీకోసమే వస్తుంది..
తన బాధని అర్థం చేసుకో..
మనసులో పెట్టుకో..
కోపమొస్తే బుజ్జగించలేవా..
సర్ది చెప్పుకుని..
తప్పులు సరిచేయలేవా...
నీకోసం బ్రతికే ఆ మనసు కోసం ఆ మాత్రం చేయలేవా..
ఎందుకు చిరాకు చూపిస్తావు..
కోపంతో మాట్లాడతావు.....
తను బ్రతికే ప్రతిక్షణం నీకోసమే అని తెలియదా...

Comments

Popular posts from this blog

మనసు

జీవితం

ఆడపిల్ల