జీవితం అంటే పులపాన్పు కాదు.. ముళ్ళు కూడా ఉంటాయని నాకు ఇప్పటివరకు తెలీదు.. ఎందుకంటే.. నా కాళ్లకు పూలు తప్ప ముళ్ళు కనిపించలేదు ఇప్పటివరకు.. కారణం.... నా ప్రతిసంతోషం వెనుక నీ చెమట చుక్కలు ఉన్నాయని.. నీ రుణం తీర్చాలి అంటే నా జీవితాంతం నీకోసం ఏం చేసినా అది సరిపోదు.... నీ ప్రేమని అక్షరాలుగా మారుస్తూ నా మనసు రాసే ఈ పిచ్చిరాతలు సరిపోవు.. నన్ను నీ భుజాలపై ప్రేమతో మోస్తున్నందుకు.. నా జీవితాన్ని నీ చెమటతో రాస్తున్నందుకు.. నా ప్రతిసంతోషాన్ని నీ త్యాగంతో ఇస్తున్నందుకు.. నా జీవితం నీకే అంకితం నాన్న.. ఈ జన్మలో అయితే నీ రుణాన్ని తీర్చలేను.. మరొక జన్మంటూ ఉంటే.. నీకు నాన్ననై తీర్చుకుంటా.. నువ్వెప్పుడు అంటూ ఉంటావు నేను మీ అమ్మను అని.. ఇప్పుడు అమ్మనో కాదో తెలీదు కానీ.. మరుజన్మకి నీలాంటి నాన్నగా పుట్టించమని కోరుకుంటున్నా.. నాకు బాధ కలిగినా,సంతోషం కలిగినా గుర్తొచ్చేది నువ్వే నాన్న.. ఆవేశంతో,ఆలోచన లేకుండా దారితప్పుతున్న ప్రతిక్షణం నీ మాటలే నన్ను నడిపిస్తున్నాయి.. ఒక్కోసారి అనిపిస్తుంది.. నేను లేని నీ బ్రతుకు ఎలా ఉంటుందోనని.. ఎన్ని బాధలు వచ్చినా.. ఎంత కష్టం వచ్చినా.. నిన్ను నేనెప్పటికి ఒంటరిని చేస...