స్ఫూర్తి..
ఎప్పుడోపోయే ప్రాణానికి ఇప్పటినుండే చేతకాని చితులు పేర్చడమెందుకు
మెదడుకు పట్టిన చీడను విదిల్చి చూడు
చేవజచ్చిన చోట జీవం తెచ్చుకుచూడు
శిశిరంలో రాలిపోయిన ఆకు వసంతంలో చిగురించలేదా..
వేసవిలో ఎండిన నదులు వానలతో నిండలేదా
కాలే కట్టే నిన్ను కాల్చొచ్చు
కానీ...
మండే మంట వేరొకరికి వెలుగునివ్వాలి✊
-నందన✍
Comments
Post a Comment