Posts

Showing posts from March, 2020

బంధం

కరుగుతున్న క్షణానికి.... తరుగుతున్న వయసుకి... ఊపిరి ఉన్నంతవరకు నిలిచిపోయే జ్ఞాపకమే.. నీతో నాకున్న "బంధం"....

అనంత గాథ - సీమ ఘోష

Image
దశాబ్దాలుగా చినుకులకి తడవని నీ మేను.. మట్టివాసనెలా గుబాలిస్తుంది తల్లి... రక్తం ఆవిరైపోతున్నా  మా ఆశలే ఊపిరై పోతుంటే.. నీ బిడ్డలకింత బువ్వ పెట్టేందుకు తపిస్తున్నావా సీమతల్లి... కరువు బరువై.. గుండె చెరువై ఎండిన బీళ్ల సాక్షిగా.. నిన్నేలుతున్న నేతలకు లేదాయే కదమ్మా కాసింత మనస్సాక్షి.. అమ్మా... అనంతమ్మా.. వసంతమే కరువాయే కదమ్మా ఈ సీమకు.. ఎండిన నీ గుండెలు బాధతో కాష్టంలా రగులుతునప్పుడు.. పొంగిన నీ దుఃఖం పెనుగంగగా ప్రవహిస్తున్నప్పుడు.. ప్రశ్నించే పిడికిల్లే బాణంలా ఎదురెళ్తాయప్పుడు.. ఉద్యమించే ధీరుడు వీధికొకడు ఉదయిస్తాడప్పుడు

😊

ప్రపంచానికి కనిపించని కన్నీటి చుక్కలు ఎన్నో మనసులో ఉంటాయి.. తనకై తపించే మనసు ఆ కన్నీటిని గుర్తిస్తే చాలని తపిస్తాయి.. నిజమే.. ఈ ప్రపంచంలో పైకి చూపించే కోపాన్ని గుర్తించినంత సులభంగా మదిలో దాగిన బాధని,కన్నీళ్ళని ఎవరు గుర్తించలేరేమో కదా!