Posts

Showing posts from January, 2019

మనిషి

మంచోడంటే.. ఏదో పంచే వాడని కాదు.. ఎవరిని "ముంచకుండా " మెలిగేవాడని అర్థం🙂

లైఫ్

అగ్నిపర్వతంలో ఉన్న "లావా" ను అగ్గిపెట్టెలో బంధించలేము కదా.. నీలోని ప్రతిభ "లావా"లాంటిదైతే.. నిన్ను అడ్డుకునే అవాంతరాలన్ని అగ్గిపెట్టలే.. మరెందుకు అగ్గిపెట్టెలాంటి సమస్యలకి భయపడి పారిపోతావు.. "లావా" లా ఆ సమస్యల్ని దహించివేయలేవా?

స్ఫూర్తి

నీ సామర్థ్యం నీకు తెలిసినప్పుడు.. అనుమానాలకు తావివ్వకు.. అవమానాలను పట్టించుకోకు.. అవహేళనలను లెక్కచేయకు.. అపజయాలకు నిరాశ చెందకు.. ఆత్మవిశ్వాసమే నీ శ్వాసగా అడుగు ముందుకేసి.. విజయాన్ని అందుకో✊

ప్రేమ

ద్వేషానికి, ప్రేమకి దూరమెంతో తెలుసా... నీవల్ల వచ్చే కన్నీటికి.. నీకోసం వచ్చే కన్నీటికి మధ్య నువ్వు చేసే ప్రయాణమంత😐

బంధం

బాధలో ఉన్నప్పుడు నువ్వు కోరుకున్న బంధం నీకు భరోసాగా ఉండాలి కానీ.. ఆ బంధమే నీకు బాధగా మారితే.. బ్రతుకే బలహీన పడిపోతుంది జాగ్రత్త😐

బ్రతుకు పోరాటం

రామాయణాన్ని బట్టి రాముడు మంచోడంటాం భారతాన్ని బట్టి భీముడు బలవంతుడంటాం మరి నువ్వెంటో తెలుసుకోవా ఆ రామాయణ,భారతాలకంటే తక్కువేం కాదుగా నీజీవితం అక్కడ వనవాస,అరణ్యవాసాలకు టైమంటూ ఉంది మరి ఇక్కడ నీఆశలకు అవసరంకోసం నువ్వేసే వేశాలకు అంతమేలేదు😑 పాడెక్కేలోపే నీపాత్ర ఏంటో తేలాలిగా తెలుసుకో😐

జీవితం

నేర్చుకునే క్రమంలో.. ఓర్చుకోవడానికే తప్ప.. నొచ్చుకోవడానికి చోటుండకూడదు...

మగువ

Image
ఏడ్వలేక.. మౌనంగా ఉండలేక.. దాచుకోలేక.. బయటకి చెప్పలేక.. చావలేక.. బ్రతకలేక.. అసలెందుకిస్థావయ్యా.. నరకం లాంటి జీవితం కొందరు మగువలకి😭