Posts

Showing posts from April, 2020

..

నీవల్ల ఒకడికి చెడు జరుగుతుందని వాళ్ళు భావిస్తే.. నీకు కష్టం అనిపించినా సరే దూరంగా ఉండు.. ఎందుకంటే.. నీ సంతోషంలో నువ్వు ఓడిపోయినా.. తన సంతోషంలో గెలుస్తావు కదా...

పోరాటం

చావును కూడా చంపాలంటే నలుగురికోసం బ్రతికి చూడు.. ఓటమినే ఓడించాలంటే.. గెలిచేవరకు పోరాడి చూడు..

ఆశ

బతకాలనే ఆశ బండరాయిని సైతం ఓడిస్తుంది.. గెలవాలనే తపన ఓటమిని కూడా శాసిస్తుంది

మనసు

కన్నీళ్ళన్ని ఏమైపోయాయి అంటుంటే... ఎదుటివాళ్ళని హేళన చేస్తూ ఆనందించే ఈ సమాజంలో.. కరడుగట్టిన నా గుండెతో.. బతుకీదడానికి సమిధులయ్యాయి అంటుంది నా మనసు

మరణమా..

Image
మరణమా నన్ను నీలో కలుపుకో... మరుజన్మ ఉంటే నన్ను మరబొమ్మగా పుట్టించు.. నా పంచేంద్రియాలు పనిచేయకుండా నిలిపుంచు.. స్వార్థపూరిత లోకంలో.. మనిషిని మనిషిగా చూడని మనుషుల్ని భరించలేకున్నా.. ఈ బాధలకు దూరంగా వెళ్లాలనుకుంటున్నా... విడిపించుకోలేని బంధాలతో నాకు సంకెళ్లు వేయకు

నాన్న

నాన్నతో ఉండే బంధాన్ని మాటల్లో వర్ణించలేము అనుభవిస్తే తప్ప.. అలాగే ఆయనని కోల్పోతే వచ్చే బాధ ఎన్నటికీ తీరనిది.. ఆ గాయం ఎప్పటికి మానిపోనిది.. నాన్నకి సాటి ఈ ప్రపంచంలో ఏ ఒక్కరులేరు.. రారు..