Posts

Showing posts from September, 2019

😊

మనవల్ల ఎవరైనా ఇబ్బంది పడతారని తెలిసినప్పుడు.. కష్టమైనా సరే దూరంగా ఉండటమే మంచిది.. ఎందుకంటే.. మన సంతోషంలో మనం ఓడిపోయినా.. తన సంతోషంలో గెలుస్తాం కదా😊

గమ్యం

నువ్వు ఎదుటిమనిషి నచ్చేలా ఉండాలనుకున్న రోజు ఆనందంతో అక్కడే ఆగిపోతావు.. నువ్వు నీ మనసుకి నచ్చినరోజే ఆత్మవిశ్వాసంతో మరో అడుగు ముందుకు వేస్తావు..

😏

తెలిసి,తెలియక ఎదుటివాళ్ళ మనసుని బాధపెట్టకు.. నువ్వు సరదాకే అని ఉండొచ్చు.. కానీ.. ఆ మాట ఎదుటిమనసుని ఎంతలా గాయం చేస్తుందో ఆలోచించు.. అందుకే ఏదైనా మాట అనేముందు నోరు అదుపులో పెట్టుకో లేకుంటే బాధపడాల్సి వస్తుంది!!

జీవితం

తియ్యని కలలకు.. చేదు నిజాలు తొడయ్యేదే జీవితం

అన్నాచెల్లి

అమ్మతనంలో ఆప్యాయతని నాన్న పరువులో నీబాధ్యతని అది,ఇది అడగకు అన్నిటినీఇస్తూ అన్నివేళలా తోడుగాఉంటూ అడుగడుగునా నాఅదుపులు చెప్తూ అన్నపేరుకే అర్థాన్నిస్తూ ఆదరించిన ఓఅన్నయ్యా కడతేరని నాకలల సాక్షిగా ననుచేరిన నీనవ్వు సాక్షిగా మాటివ్వు నాముందుంటానని మరణం వరకు నను వీడనని...

రాయలసీమ

రైతే రాజు అనే రాజసాన్ని పక్కనపెట్టి కన్నీళ్లతో నాగలికి దండం పెట్టి పలుగుపార చేతబట్టి రైతు స్థాయి నుండి కూలీలుగా మారిన "అనంత"కథలెన్నో.. "అనంతపురం"లో...

సీమ

రాజకీయ తగాదాలు.. రాజుకున్న నిప్పులై.. బాంబులతో దద్దరిల్లి.. పేరెన్నికగన్న రాయలసీమ.. నేడు కరువు రక్కసి నోట చిక్కి కన్నీరు పాలవుతుంది ఆదుకునే అండ కోసం ఆశతో చూస్తుంది

సీమ తిరుగుబాటు

మీరెన్ని జెండాలు మార్చినా.. అజెండాల్లో సీమ ఊసేది.. మీరాడే ఆటలు చూసి.. మాకు విసుగైపోయిందయ్యా.. మా కోసం మా యువత వేయి గొంతుకలు ఒక్కటిగా నినదిస్తున్నారు.. సీమ కష్టాన్ని ప్రపంచానికి సెప్తున్నారు మీ నాటకాల పరాదాలు పక్కకి జరిపి ఇకపై జాగ్రత్తగా మసలుకోండి..

రాయలసీమ

మొన్న రత్నాల సీమ నిన్న రాళ్ళసీమ పాలకుల నిర్లక్ష్యం వల్ల నేడు భస్మ సీమ.. రేపు కారాదు చితాభస్మ సీమ.. మన బ్రతుకుల్ని వెనక్కి నెట్టిన అసమర్ధ పాలకులపై.. నేడే సింహగర్జన చేయి..

పోరాటం

తరాల నుండి బానిసత్వ బ్రతుకులు ఇంకెన్నాళ్లు ఈ అవినీతి,అవకాశవాద నాయకులకు కొమ్ముకాస్తావు నీకు పౌరుషం లేదా సీమ బిడ్డ ఒకడి పాదాల చెంత బానిసలా బ్రతుకుటనా రా నీ హక్కుల కోసం పోరాడు కదలిరా వేయి గొంతుకలను ఒక్కటిగా చేసి నినదిద్దాం మన పొగరు చూపిద్దాం✊

జవాన్

నేలరాలిన తారల్లారా.. నెత్తురు చిందిన నేస్తాల్లారా సరిహద్దు ఒడ్డున రక్షకుల్లారా సమరమున సదా సైనికుల్లారా మీరు సైతం లేకుంటే.. మాకు బ్రతుకులేదు.. అందుకే అందుకో మా సలాం..

ధైర్యం

సముద్రమంత శక్తినీది అలజడులేవి నీకు అడ్డంకాదు ఓటమంటే నిచ్చెనే విజేతలంటే వింత వ్యక్తులుకాదు వాళ్ళు మనలాగే మనుషులు ఓటమంటే ఎరుగనివాడు ఒక్కడైనాలేడు పుట్టుకతో ఎవరు విజేతకాదు పట్టువదలక ప్రయత్నించిచూడు నీజీవితాశయం నెరవేర్చిచూపు తలపు గెలుపుపైనిలుపు విధిరాతనే మార్చేసి నీరాత నువ్వే రాసుకో..

రాయలసీమ

ఒకప్పుడు రాయలోరు ఏలిన రతనాల సీమ.. నేడు రాళ్లసీమ.. కరువు కాటకాలతో.. వలస జీవితాలతో నిండిన కన్నీటిసీమ😔

రైతు

అన్నాన్ని కూడా ఆన్లైన్లో తెప్పించుకునే కాలంలో మెట్టదున్ని మడినాటే రైతుల ఇక్కట్లు ఎవడికి కావాలి పశుగ్రాసంలేక పశువులు అశువులుబాసి పుడమితల్లి గొడ్రాలైపోతే ఎవడికి కావాలి సారంకోల్పోయిన నేలకి తడారిపోయిన ఆకాశానికి మధ్య నలిగిపోయే అన్నదాత ఆర్తనాదం ఎవడికి కావాలి😕 కావాల్సిందల్లా "ఓటు" కదా

బాధ్యత

బాధ్యత తీసుకున్నోడు న్యాయం చేయాలనుకోవాలి.. అంతే కానీ.. సాయం కాదు.. సాయం అనుకుంటే అది బాధ్యత కాదేమో కదా..

మనసా

ఎన్నాళ్లీ మట్టిపై మెరుస్తావో.. ఏనాడీ కట్టుకథను ముగిస్తావో.. తెలిస్తే బాగుండేది.. ఈ ఆశలకు హద్దు ఉండేది మనసా..

వ్యక్తిత్వం

నీ ఆర్థికస్థితిగతులెలా ఉన్నా.. నీకెన్ని కష్టాలొచ్చినా.. నీ ఆలోచనలు మాత్రం విలువలు కోల్పోకుండా ఉన్నతంగా ఉండాలి..

లక్ష్యం

నిశ్శబ్ద తరంగలెంత వెక్కిరిస్తున్నా.. నీ లక్ష్యసాధనను ఆపకు నడిరేయి నిశీధిలోనైనా..

పోరాటం

చావును కూడా చంపాలంటే.. నలుగురికోసం బ్రతికి చూడు.. ఓటమినే ఓడించాలంటే.. గెలిచేవరకు పోరాడి చూడు..

వ్యక్తిత్వం

పరిస్థితులకు అనుగుణంగా తమ వ్యక్తిత్వాన్ని మార్చుకునే మనుషులకి.. కారణాలు సృష్టించుకుని నీ నుండి దూరమయ్యే బంధాలకి విలువ ఇచ్చి.. నీ విలువని కోల్పోకు..

బాధ్యత

బాధ్యత తెలిసినోడు ఎంత బరువైనా మోస్తాడు సరిహద్దులోని సైనికుడిలా.. బాధ్యతని బరువుగా అనుకునేవాడు చిన్న గడ్డిపోచ కూడా మోయలేడు బలిసినోళ్ళ బిడ్డలాగా!!

బంధం

ఎదుటివాడిని శత్రువుగా చూసి తనపై గెలవాలని చూడకు.. స్నేహంతో తన ఓటమిలో కూడా నీ గెలుపుకి ఆనందించే బంధాన్ని పెంచుకో.....

నా అడుగులు

బాధలతో బంధీయై.. బదులుతోచని పయనంలో.. ఆలోచనలే నీడగా.. గుండె చప్పుడే తోడుగా.. నా అడుగులు పరిగెడుతున్నాయి గెలుపుబాటను వెతుక్కుంటూ...

😏

నీ మనసుకి నచ్చింది చేయడంలో తప్పు లేదు.. కానీ.. వేరొకరి మనసు నొప్పించి చేయడం మాత్రం చాలా తప్పు!!

జీవితం

నిన్ను గతంలోకి నెట్టేసే జ్ఞాపకాల కంటే.. నీ భవిష్యత్తుని శాసించే ఆశయాలకే బలం ఎక్కువ..

గమ్యం

గుమ్మంలోనే కూర్చుంటే నీ గమ్యాన్ని ఎలా చేరుకుంటావు చెప్పు.. కొన్నాళ్ళు కొన్నిటికి దూరంగా ఉంటేనే నీ లక్ష్యాన్ని చేరుకుంటావు.. ఎలా బ్రతకాలో నేర్చుకుంటే సరిపోదు.. కొన్నిటిని ఓర్చుకోవడం కూడా తెలుసుకో.....

గెలుపు

ఓటమి నుండి గుణపాఠం నేర్చుకో.. గెలుపు నుండి వినయం నేర్చుకో...

సాయం

నా అవసరానికి సాయం చేసేవాళ్ళు లేనప్పటికంటే.. ఎదుటివాడి కష్టం తెలిసి కూడా నేను సాయం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు కలిగే బాధ అధికం😑

మనసు

నువ్వు కోరుకునే సముద్రమంత ప్రేమకి నా మనసు సరితూగగలదో లేదో తెలీదు కానీ.. నేను నీపై పెంచుకున్న అంతులేని ప్రేమ ఎంత విశాలమైనదో చూపాలంటే ఆ ఆకాశం కూడా సరిపోదు❤

గెలుపు

ఓడిపోతున్నావంటే ఇక జీవితంలో గెలుపే లేదని కాదు.. గెలుపుకి దగ్గరవుతున్నావని అర్థం..

ఓం నమశ్శివాయ

శశి శేఖరుడా.. శిరోగంగాధరుడా.. నంది వాహనుడా.. సర్ప కంఠాభరణుడా.. నిరాడంబరుడా.. నిరాకారుడా.. సర్వాంతర్యామి..ఓం శివోహం.. ఓం నమశ్శివాయ

అబ్దుల్ కలాం

భారతదేశానికి రాష్ట్రపతిగా విశిష్టసేవలందించి శాస్త్ర సాంకేతికరంగాల పరిశోధకునిగా రచయితగా అసమాన ప్రతిభాపాటవాలు చూపి భారతజాతి కీర్తిపతాకాన్ని తన శాస్త్రీయ మేధాశక్తితో ప్రపంచం ముందు గర్వంగా ఎగరేసిన మహోన్నతవ్యక్తి, భారతరత్న శ్రీ ఏపీజే అబ్దుల్ కలాంగారి వర్ధంతి ఘననివాళులు

జవాన్

వణికించే చలి ఒకవైపు.. వెన్నులో వణుకు పుట్టించే వైరులు మరోవైపు.. సలసల మండే ఎండ ఒకవైపు.. సరిహద్దుల్లో సంరక్షణ మరోవైపు.. వెన్ను వణుకుతున్నా.. వొళ్ళు సహకరించకున్నా.. వెనుతిరగక మాకై నిలిచే సైనికుడా నీ ధైర్యానికి మా సలాం🙏

జవాన్

దేశానికి అమ్మ స్థానాన్ని ఇచ్చి.. దేశభక్తిని జెండగా మలచి.. నీ స్వాతంత్ర్యాన్ని త్యాగం చేస్తూ.. మా స్వాతంత్ర్యానికై కాపుకాసే సైనికుడా... ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం🙏✊

జవాన్

మండుటెండల్లో మంచు కొండల్లో నిప్పుకణికల మధ్య నిలిచే ధైర్యం నెత్తుటి మడుగులో నీఅడుగే ధైర్యానికి నిదర్శనం వెలకట్టలేని త్యాగం వెన్నుచూపని వీరత్వం మాతృభూమి రుణం మరణంగా స్వాగతించే మీస్థైర్యం మరణం మీముందున్న మీసం మెలేసే పౌరుషం నవతరానికి నెత్తుటి స్ఫూర్తి సంతకం మీఅమరత్వం🙏

😏

నీ మనసులో కలిగే ప్రతి బాధ నీ కన్నీటికి మాత్రమే తెలుస్తుంది.. బ్రతికేది నువ్వే భరించాల్సింది నువ్వే చితి వరకు మోయాల్సింది కూడా నువ్వే అలాంటప్పుడు ఎవరికో చెప్పుకోవాలి నీ బాధని తీర్చుకోవాలని ఎందుకంత ఆరాటం.. నువ్వు చెప్పే మాటల్ని పదిరకాలుగా చెప్పుకుని పరిహాసం చేయటానికే వాళ్లంతా!!

ఆజాద్

పదిహేనేళ్ల వయసులోనే సహాయనిరాకరణోద్యమంలో పాల్గొని తనని తాను ఆజాదీగా ప్రకటించుకున్న ధీరుడు.. దేశవిముక్తికోసం "సాయుధపోరాటమే" మార్గమని నమ్మిన విప్లవ వీరుడు నాటి,నేటి యువతలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి దేశం కోసం ప్రాణర్పణ చేసిన అమరుడు🙏

అవకాశం రాలేదని బాధపడకు.. సమయం లేదని చింతించకు.. అదృష్టం లేదని కృంగిపోకు.. మనిషిగా పుట్టావని.. ఇంకా బ్రతికున్నావని.. ఏదైనా సాధించగలననే ఆత్మవిశ్వాసం తో.. రేపంటూ నీకోసం ఒకటుందని సంతోషించు.. నీ గెలుపుకి ఎన్నో దారులు కనిపిస్తాయి!!

చేతులు లేనివాళ్లే రాతలు రాసుకుంటుంటే కాళ్ళు లేనోళ్లే గమ్యాన్ని చేరుతుంటే చేతలుఆపి రాతను తిట్టుకుంటావా కదలకుండా కాలాన్ని నిందిస్తావా అంగవైకల్యం లేకున్నా నీఆలోచనలకెందుకీ వైకల్యం లే.. జీవితమనే కదనరంగంలోకి కదులు నిన్ను వంచించిన విధిని వేటాడటానికి నీబంగారు భవితకు బాటలు వేయడానికి!!

😏

ఎదుటివాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపడంలో ఉన్న ఆరాటంలో కాస్త అయినా.. నీ బాధ్యతల్ని నిర్వర్తించడంలో కూడా ఉంటే నీ బతుకు బాగుపడుతుందిగా..

పసితనం

పత్తిచేలల్లో వత్తులుగా మారే చేతులు చెత్తకుప్పల్లో ప్లాస్టిక్ ఏరుకునే నడకలు మసకబారిన పసితనపు ఛాయలు తల్లి కూలికెళ్తే తమ్ముడిని భుజానమోసే ఆడపిల్ల బాధ్యతల బరువులు ఆర్థికంగా ఛిద్రమైన కుటుంబానికి ఆసరాగామారే చిన్నారుల వ్యధలు.. ఎప్పటికి మారేనో కల్మషమెరుగని చిన్నారి బ్రతుకులు😔

నీకై నేను

అడుగులు గమ్యాన్ని చేరుతున్నా.. నా ఆలోచనలు మాత్రం ఆత్రంగా నీవైపే పరిగెడుతున్నాయి..

కన్నీళ్లు

నీడ దూరమైనా.. తోడు దూరమైనా.. ఆనందంలోనైనా.. ఆవేదనలోనైనా... మదిలోని భారాన్ని దించుతూ.. కంటిపాపలా కడవరకూ తోడుండేది కన్నీళ్లే

బంధం

బంధంలో చిన్న చిన్న బాధలుండొచ్చు.. కానీ.. బంధమే బాధగా,భారంగా ఉండకూడదు😑

నువ్వు నేను

గతం మిగిల్చిన జ్ఞాపకాల్లో నేను.. గతంలోనే జీవితమైపోయిందని నువ్వు.. ఏకాకులుగా మిగిలిపోయాం.. జ్ఞాపకాలనే సంద్రంలో....

అమ్మ

నువ్వు సాధిస్తే పొంగిపోతుంది.. ఓడిపోతే కృంగిపోకుండా ధైర్యాన్నిస్తుంది.. నువ్వేం చేసినా మురిసిపోతుంది ❤

😁

గ్యారంటీ లేని మన జీవితంలో.. మనం కొనే ప్రతి వస్తువుకి గ్యారంటీ అడుగుతాం.. ఎంత విచిత్రమో😁

అన్నాచెల్లి

రక్తం పంచుకుని పుట్టేది చెల్లి.. రక్తాన్ని చిందించి అయినా కాపాడేవాడు అన్న.. అనురాగాన్నిచ్చేది చెల్లి.. అనుబంధాన్ని పెంచేవాడు అన్నయ్య.. చెల్లి చిరునవ్వే అన్నకి ఐశ్వర్యం.. అన్న ఆదరణే చెల్లికి కొండంతబలం.. ఈ ప్రపంచంలోని అన్ని బంధాలకి మూలమే అన్నాచెల్లెల అనుబంధం❤😍😘

నా అక్షరాలు

ఒంటరిగా అనిపించినప్పుడు.. బాధని పంచుకోవడానికి అక్షరాలు.. భారాన్ని తగ్గించుకోవడానికి కన్నీళ్లు ఊపిరి ఉన్నంతవరకు తోడుండే నేస్తాలు.. బహుశా ఈ ప్రపంచంలో ఇంతకు మించిన ఓదార్పు మరెక్కడా ఉండదేమో.. ఇంకెవ్వరూ ఇవ్వలేరేమో...

బంధం

జీవితమనే నాటకరంగంలో.. ప్రతి బంధం బూటకమే.. కన్నవాళ్ళ ప్రేమ తప్ప❤

ఎందుకు

అల్లుకున్న బంధాలని తెంచేసుకుని జ్ఞాపకాలతో గడిపేస్తారు.. అదేంటో మరి.. దగ్గరగా బంధంగా అల్లుకున్నప్పుడు తెలియని విలువ.. దూరంగా వెళ్ళిపోయి జ్ఞాపకంగా మారిపోగానే తెగ బాధపడిపోతుంటారు ఎందుకో మరి!!

నీకై నేను

అలిసిన బాటసారినై.. ఆకాశం వైపు చూస్తున్నా.. రేపటి వేకువన తొలి వెలుగై నా జీవితాన వెలుగు నింపుతావని...

😏

ఉచితంగా ఏదైనా ఇవ్వడానికి(సాయం) ముందుకు రాని మనసు.. ఉచిత సలహాలు ఇవ్వడానికి ఎగేసుకుని వస్తారెందుకో!

లక్ష్యం

లక్షల కోసం నీ లక్ష్యాన్ని.. లక్ష్యం కోసం నీ లక్షణాన్ని వదులుకోకు...

కలం

అన్యాయాన్ని ఎదిరించడానికి ఒక్కోసారి "కలం" కూడా ఆయుధమౌతుంది.. "గళం" పెగలని చోట అక్షరమై పోరాటం చేస్తుంది....

నేటి తీరు

అవసరంలో ఆదుకోవడానికి మనసు రాదు... కానీ... అపవాదులు వేయడానికి మాత్రం ముందుంటారు! ఏం మనుషులో ఏంటో!

యండమూరి నవల అంతర్ముఖం

మాట.. చేత ఒకటవ్వడమే నిజాయితీ.. నీ వ్యక్తిత్వంతో నువ్వు బ్రతుకు.. నిన్ను ఇష్టపడేవాళ్ళు నీతో ఉంటారు.. లేనివాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు.. ఎవరికోసమో నీ వ్యక్తిత్వాన్ని మాత్రం మార్చుకోకు...

మౌనం

నా మౌనం చేస్తున్న యుద్ధంలో.. ఎప్పుడూ నీ పంతానిదే గెలుపు ఏ.. ఎందుకని?

ఓం నమశ్శివాయ

మదిలో మెదిలే దైవం నీవని తలిచా.. వేరే చోటెందుకని నా మదినే గుడిలా మలిచా.. తలచినంతనే పలికే దైవం నీవని పిలిచా.. ఎందెందు చూసినా అందు నీ రూపాన్నే వెతికా🙏

కన్నీళ్లు

ఖర్చులేని కన్నీళ్లకు ఆత్రం ఎక్కువనుకుంటా.. కళ్ళను తడిపేందుకు పరుగులు పెడతాయి!

జీవితం

గడిచిన గతాన్ని తలవకు.. గడిచే ప్రస్థుతాన్ని విడువకు.. వ్యర్ధమైన ఆలోచనలతో నీ లక్ష్యాన్ని చేజారనీకు....

😏

ఒంటరిగా 100kg ల బస్తాని అయినా మోయగలం కానీ.. ఒంటరిని చేసే ఒక్క జ్ఞాపకాన్ని కూడా మోయలేము... ఎందుకో...

నువ్వు

ఎప్పుడైతే నువ్వు ఎదుటోడికి లోబడి బ్రతుకుతావో.. అప్పుడే నీ స్వాతంత్ర్యాన్ని కోల్పోయినట్లు.. బానిసత్వానికి నీ జీవితం బలైపోయినట్లు...

గెలుపు

ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదు.. ఓటమి బాటలో ఎదురయ్యే ముళ్లని,రాళ్ళని ఏరిపారేస్తూ రాచబాట చేసుకుని ముందుకు సాగిపోతూ.. విజయాన్ని అందుకోవడమే✊

😏

ఒకరి నిస్సహాయతని చేతగానితనం అనుకుని వాడిపై పెత్తనం చేస్తూ విర్రవీగుతున్నావేమో.. "తాడిని తన్నే వాడుంటే.. వాడి తలని తన్నేవాడు కూడా ఉంటాడని" మర్చిపోకు..

అల్లూరి

మూడుపదులు కూడా దాటని వయసులో తెల్ల దొరలపై పోరాటం చేసిన యోధుడు.. మన్యప్రజలకు మన్యవీరుడిగా చరిత్రలో నిలిచిన ధీరుడు... తెలుగువీర లేవరా అంటూ.. తెల్లవారికి ఎదురునిలిచి.. తెలుగు జాతికి తెగువ నేర్పిన.. మన్నెం వీరుడు..

ఆడపిల్ల

తొమ్మిది నెలల పసికందా.. తొంభై ఏళ్ల ముసలావిడా.. ఎవరైతే ఏంటి వాళ్ళకి అనవసరం.. కేవలం ఆడదైతే చాలు పైశాచికంగా తీర్చుకుంటారు వాళ్ళ క్షణిక సుఖ అవసరం..

అనాధ

తన ఆనందం కోసం ఎదుటివాడి ఆయుష్షును కూడా లెక్కచేయని ప్రపంచం ఇది.. మీ ఆకలి గురించి పట్టించుకుంటుందా?

😑

నీలో ఉన్న భయమే ఎదుటివాడికి నిన్ను బానిసను చేస్తుంది...

ధైర్యం

మొన్న,నిన్న,నేడు నీకు అనుకూలంగా లేకపోవచ్చు.. కానీ.. నీకంటూ నిన్ను నువ్వు నిరూపించుకునేందుకు ఒకరోజు వస్తుంది.. ఎదగాలంటే ఎన్నో రాళ్లదెబ్బలు తట్టుకుని ఎదురుచూడాలి తప్పదు మరి....

ఆస్తి,అంతస్థుల కోసం అనుక్షణం పరుగులు పెట్టే నువ్వు.. ఒక్కసారి ఆశయం కోసం పరిగెత్తి చూడు.. నీలోని అలుపే గెలుపులా ఎదురవుతుంది!!

😑

ఎక్కడ ప్రేమ పెరుగుతుందో అక్కడ మనసు మరుగుతుంది.. మమత అనే మంటల్లో..

రాత్రైతే చంద్రుడికి విలువ పగలు సూర్యుడికి విలువ కానీ ఏది లేకున్నా సృష్టిలేదు సూర్యచంద్రులకే ఒక్కోసారి గ్రహణం తప్పదు సాధారణ మనుషులం మనమెంత చెప్పు ఆటుపోట్లు ఎన్నో తట్టుకుంటేనే ఒడ్డుకి చేరగలవు ఎవరో ఏదో అంటున్నారని నీలో భయాన్ని,అసహనాన్ని తెచ్చుకుని ఆత్మవిశ్వాసాన్ని దూరం చేసుకోకు!!

జవాన్

దేశభద్రత కోసం కన్నతల్లిని,ఉన్న ఊరుని వదిలి బంధాలకి దూరంగా ఉంటూ అవినీతి పందికొక్కులు దేశాన్ని అంగడిబొమ్మగా చేసి అమ్ముతున్నా మీరు మాత్రం భరతమాతని ముష్కరుల నుండి కంటిమీద కునుకు లేకుండా కాపాడతారు ఏమిచ్చినా, ఎంతచేసినా సైనికుడి రుణం తీర్చుకోలేనిది!!

నీకై నేను

సముద్రం ఒడ్డునే నిల్చున్నా.. కానీ.. సంద్రమంత లోతైన ఆలోచనలతో మునిగున్నా...

ఆత్మవిశ్వాసం

అస్తమిస్తున్న వెలుగు ఉదయించడానికే.. ఆవిరవుతున్న నీరు వర్షించడానికే.. ఎండిపోతున్న కొమ్మ మళ్ళీ చిగురించడానికే.. అలాగే.. ఓడిపోతున్న నువ్వు గెలవడానికే.. ఓటమి వచ్చిందని బాధతో ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోకు!!

నీకోసం

నిలువని నిమిషంలో నీ సగమై నిలిచున్నా... కదిలే కాలంలో కలమై సాగుతున్నా...

స్నేహం

నిన్ను నలుగురు మోసే రోజు.. ఆ నలుగురిలో ఒకడైనవాడే నీ స్నేహితుడు... ఆరోజు తన అంతిమయాత్రను సైతం వాయిదా వేసుకుని నీముందు వాలిపోయే వాడే.. నిజమైన స్నే'హితుడు' స్నేహితులు చెడ్డవాళ్ళు ఉంటారేమో కానీ... స్నేహం అనే పదం మాత్రం ఎప్పటికి అమూల్యమైనదే!!

నువ్వు నేనులా

కంటి భాషని కరుణించి.. మనసు భాషను మన్నించి.. చేతి భాషకు పులకించి.. దరికి చేరావు నువ్విలా.. మురిసిపోయాము ప్రేమలా.. నీకై ఉన్నాను నేనిలా.. నువ్వున్న నేనులా..ఇలా..😘

ప్రేమ కెరటం

మనసు నీతో మాట్లాడాలని ఆరాటం నువ్వెదురైతే ఆమాటలకోసం పోరాటం నాగుండెల్లో ఎగసి పడుతుంది ప్రేమ కెరటం ఎలా? నీ మనసు తీరం చేరటం😘

ప్రేమ జల్లు

మేఘం కరగలేదు.. వర్షం కురవలేదు.. కానీ... నీ ఆలోచనల జల్లుల్లో నేను మాత్రం తడిసిపోతూనే ఉన్నా❤❤

నీకై నేను

కాలమేదైనా.. నే రాసే ప్రతి కావ్యం నీదే.. యుగాలెన్నున్నా.. నే గడిపే ప్రతిక్షణం నీకే..💖

నా నువ్వు

నా పెదాల్లో నవ్వు నువ్వు.. నా ఊహల్లో చిత్రం నువ్వు.. నా కవితలకి ఊపిరి నువ్వు.. నా గుండెల్లో చప్పుడు నువ్వు.. నేను అనే పదానికి అర్థమే నువ్వు..

నీకై నేను

నాకు ఎవరులేరు అనుకునే క్షణాన #IMissYou అని నువ్వు msg పంపినపుడు నాకు ప్రేమంటే ఎంటో తెలిసింది నువ్వే నా ప్రేమని నువ్వు నాతో ఉంటే నేనే నువ్వైపోతానని❤

నాప్రేమ

చేతిలోని పాలబువ్వతో.. పసివాని వెనుక పరిగెత్తే అమ్మలా.. నా మనసునిండా ప్రేమతో❤ నీ వెనుకే వస్తున్నా.. నిత్యం నువ్వు వెళ్లే దారిలో!!

నా ప్రాణం

నీ నవ్వే నా శ్వాసగా.. నీ శ్వాసే నా ఊపిరిగా.. నువ్వే నా ప్రాణంగా.. నీలో నే సగభాగంగా.. అణువంత నన్ను తలచినా.. ప్రపంచమంత ప్రేమను నీకు అందిస్తా❤

ప్రేమ కవిత

ప్రాణం అనే కలంలో.. ఊపిరి అనే ఇంకు పోసి.. నేను రాస్తున్న ఈ పదాలన్నీ నీకే అంకితం❤

ప్రేమ కెరటం

నిన్ను కలిసేందుకై ప్రయాణం చేసే పరుగాపని కెరటం నేను నా రాకకై నీలాకాశం సాక్షిగా నిరీక్షించే తీరం నువ్వు నీగుండెలపై సేదతీరే ఆక్షణం చాలు మరోజన్మ వరకు సరిపోయే ప్రేమని పొందడానికి..

నా నీడ

నేనెప్పుడూ నీవెంటే ఉంటున్నా.. కావాలంటే నీ నీడని చూడు.. అది అచ్చం నాలాగే ఉంటుంది!!

నింగిలోని జాబిలి నువ్వు

నా జ్ఞాపకాల సాగరంలో జారవిడుచుకున్న జాబిలి నువ్వు...

ప్రేమ

నువ్వు నువ్వుగా కాకుండా... నేనైన నువ్వుగా నాలో ఒదిగి పోవడమే ప్రేమ❤

నువ్వు నేను

వరమనుకోనా ఈ జన్మకి.. ముడిపడిపోనా నీ ప్రేమకి.. ఊపిరి అవనా నీ ప్రాణానికి.. ఋణపడిపోనా జీవితాంతం ఆ దైవానికి!!

నీ ఊపిరినై

కాలం కాదన్నా... ఏ దూరం అడ్డున్నా... నీ ఊపిరినై జీవిస్తున్నా..❤

నువ్వే నా శ్వాస

తుది శ్వాస వరకు నా ప్రేమ నీతోనే నువ్వు నాలోనే..

నీకై నేను

నానుండి జారిపోయిన క్షణాలవి ఆత్రంగా పట్టుకోబోతే జారిపోయాయి పోనీలే ఏరుకుందాం అనుకుంటే మరికొన్ని రాలిపోయాయి రాలిపోయినవి ఏరుకోలేక జారిపోతున్న వాటిని పట్టుకోలేక సాగుతున్న నాపయనంలో నిన్ను చూసాకే అర్థమైంది.. రాబోయే క్షణాలు రాలిపోయిన క్షణాలని మర్చిపోయేలా చేస్తాయని!!

ప్రేమవర్షం

నిన్నే కదా తలచాను దానికి చినుకుల సైన్యమెందుకు.. నీ మనసే కదా కోరాను మరి మెరుపుల దాడి ఎందుకు.. కాదంటే నల్లని మబ్బులా నిలిచిపో.. కష్టమైతే వేడి గాలిలా వీచుకో.. అంతేగాని నాపై కురిసి నా ప్రేమని కరిగించకు!!

నీకై నేను

ఎక్కడ ఉన్నా నీతోనే ఉన్నా.. నీకై ఆలోచిస్తూ ఉండిపోతున్నా.. ఏమిటో ఈ నా వింత నడవడిక.. సతమతమౌతున్నా నాకే తెలియక..

ఎవరు

మరపురాని తీపి గుర్తువా😍.. కరిగిపోని కన్నీటివా.. నా కవితలకి రూపానివా.. నా ప్రాణానికి ఊపిరివా.. నాలో దాగిన నువ్వు ఎవరు?

నా ప్రేమ

నా గుండె గుప్పెడే కానీ... నీపై నాకున్న ప్రేమ ఆకాశమంత..😍😘

నాప్రేమ

ఆకాశమంత ప్రేమ ఉందో, లేదో సముద్రమంత లోతైనదో,కాదో తెలియదు కానీ.. నాకు తెలిసిన నా ప్రపంచం మాత్రం నువ్వే❤

కొంటె ప్రేమ

అలల తాకిడికి తడిసిన తీరంలా.. వరద ముంపుకి గురైన గ్రామంలా.. గాలవానకు ఒరిగిన చెట్టులా.. ఎదురుచూస్తోంది నా మనసు నీకోసం!!

మనసు

మనిషికి మనసున్నదని చెప్పేది మరో మనసున్న మనిషే.. మన జీవితంలో ఎన్ని ప్రయాణాలు చేసినా.. ఎక్కడున్నా.. ఎవరితో ఉన్నా.. మన మనసులో ఉన్న ఆ మనిషిని మర్చిపోకపోవడమే ప్రేమ!!

స్నేహం

ఈ ప్రపంచంతో నాకేం పని.. నా ప్రపంచమే నువ్వయ్యాక.. కన్నీళ్లతో నాకేం పని.. ఆనందాన్ని పంచే నువ్వుండగా !!

బందీ

నేను అనే రెండక్షరాల విలువ తెలియని నా మనసుకి.. మనం అనే  నీ ప్రేమతో నన్ను బంధించేశావు

జీవితం

జీవితమనేది నువ్వు నడిచే దారి లాంటిది.. నీకు తోడుగా నడిచేవాళ్ళు ఉంటారు కానీ.. నీకు బదులుగా నడిచే వాళ్ళు ఉండరు ఆ దారిలో ముళ్ళు,రాళ్లున్నా వాటిని దాటుకుంటూ నువ్వే నడవాలి..

నీ నేస్తంలా

కన్నీటి సంద్రాన్ని కనుమరుగు చేస్తూ చిరునవ్వు మేఘాన్ని చినుకులుగా చిందిస్తా ఎంతకాలమైనా వేచి చూస్తా❤ నీ..నేస్తంలా

నీకోసం

ప్రతి జన్మలో నీతో ఒక బంధం కావాలని.. ఏ జన్మలోనూ నేను తీర్చలేని ఋణానివై ఉండిపోవా.. మరు జన్మలో కూడా నాతో కలిసి ఉంటానని మాటివ్వవా.. వేచి చూస్తుంటా నీకై ప్రతి జన్మలో నీ ప్రాణంలా...

ఊహల జడి

కనిపించని నీ రూపాన్ని .. నా గుండెల్లో దాచాను.. వినిపించని నీ గానాన్ని.. నా శ్వాసలో నింపాను... అనుక్షణం నీ ఊహల జడిలో తడిసిపోతున్నా..

సీతాకోకచిలుక

బంతిపూల తోట నుండి బయటకు రాలేక.. అక్కడే తిరిగే సీతాకోక చిలుకలా.. నన్ను నీ తలపుల్లో బంధీని చేస్తున్నావేంటి..

ప్రతిక్షణం నీడలా నీవెంటే నేనుంటా.. నిన్ను నా గుండెచప్పుడులో కలుపుకుంటా.. నువ్వే నా శ్వాసగా నాలోనే దాచుకుంటా.. ఊపిరి ఉన్నంతవరకు నా ప్రాణంలా చూసుకుంటా..

నీకోసం

నేనేలేని నాలో నిను దాచుకున్నా.. నీతోనే బ్రతుకంటూ కలలెన్నో కన్నా.. ఏ చోట నీవున్నా నీవెంటే వస్తున్నా.. నా ప్రేమ వివరింప మౌనమై పోతున్నా.. తెలిసిందా ఎపుడైనా నీ మనసుకైనా.. తనని నీకంటే మిన్నగా ప్రేమిస్తున్నా...

నీకోసం

కళ్ళు మూస్తే కలలో.. కళ్ళు తెరిస్తే ఇలలో.. ప్రతి చోట నీరూపం అనుక్షణం కవ్విస్తుంటే.. నీ పేరే పలుకుతున్న నాగుండెచప్పుడు నీకు వినిపించేదెప్పుడు..

నీకై నేను

నీ గమ్యంలో..నీవెంటే.. నీ నీడనై ఉన్నా.. చెప్పలేని భావాలు చూపులతో ముడిపెట్టి.. నాకోసం వెతికే నీకళ్ళకి చెప్పు .. నా మనసులో ఉన్నది నువ్వేనని!!

నీకోసం

నిన్నటిదాకా ప్రతి విషయంలో ముందు ఉండాలనే ఆరాటం. ఈ రోజెందుకీ కొత్త ఆలోచన.. నీ వెనుక నడవాలని.. నీ అడుగులో అడుగు వేస్తూ జీవితాంతం నీతో గడపాలని!!