Posts

Showing posts from October, 2019

ప్రేమ

నిజాయితీగా ప్రేమించాను.. కానీ.. కన్నవాళ్ళ బంధాలకు బందీ అయిపోయి నిన్ను వదిలి వెళ్లిందని.. గుండెల్లో మోయలేకున్నావని నువ్వంతలా రోధిస్తున్నావే.. మరి నువ్వే తన ప్రాణం అనుకుని,సర్వం నీకే అర్పించి కన్నవాళ్ళకై తన జీవితాన్ని పణంగా పెట్టి.. గుండెల్లో నిన్ను మోస్తూ.. గుండెపై మరొకరిని మోయాలంటే తను ఇంకెంత నరకం అనుభవిస్తుందో అర్థం చేసుకోలేవా.. ప్రేమంటే నమ్మకం.. ప్రేమంటే తన కోసం తనని కూడా వదులుకుని,సర్వాన్ని త్యాగం చేయడమే.. కలిసి బ్రతకలేని పరిస్థితిలో మరొకడికి చేరువ కాలేక.. ప్రాణం అనుకున్నవాడిని మరువలేక బ్రతికినంత కాలం ప్లాస్టిక్ నవ్వులతో నటిస్తూ బ్రతికే మగువలందరో ఈ కలియుగ భారతంలో.. కులపిచ్చితో ఎన్నో స్వచ్ఛమైన మనసుల్ని సమాధి చేస్తున్న పెద్దలెందరో.. కులం అనే ఈ కాల సర్పాన్ని అంతమొందించేదెన్నడో.. ఆడపిల్ల గుండెచాటు బాధని గుర్తించేదెవ్వరో...😔😕😰

ప్రేమ

నీకోసం నేను తీసుకునే "Caring" నీకై నేను చేసే "Daring" నీతో కలసి బ్రతకడానికి నాలో నేను నిత్యం చేసే "Fighting" నీ జ్ఞాపకాలను అక్షరాల రూపంలోకి మార్చుకునే "Writing" ప్రతిక్షణం నీకోసం నేను చేసే "Thinking" ఇదే కదా ప్రేమంటే❤😘