Posts

Showing posts from November, 2019

మనసు

మనసు భారంగా ఉన్నప్పుడు మౌనమే సమాధానమౌతుంది.. గుండెల్లో బాధ మోయలేనప్పుడు.. కళ్ళల్లో కన్నీళ్లుగా మారుతుంది

జీవితం

జీవితమనే గులాబీ తోటలో.. మనసుని గాయపరిచే ముళ్లను సైతం.. ఓర్పుతో,నేర్పుతో భరించాలి..తప్పదు!

అమ్మాయి

ఒక అమ్మాయి తన జీవితంలో.. చెప్పలేని విషయాల కంటే.. చెప్పుకోలేని చాలా ఉంటాయి.. ఎలా చెప్పాలో కూడా తెలియక తనలో తాను నలిగిపోతు.. కడవరకు జీవితాన్ని సాగిస్తుంది...

😑

నేడు గడిచే క్షణాలు.. మరుపురాని తియ్యని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయో.. ఎన్నటికీ మరిచిపోలేని గాయాలుగా మారతాయో.. ఎవరు ఊహించగలరు? భవిష్యత్తు ఏమౌతుందోనని భయంతో.. నేటి బంగారు క్షణాలను కోల్పోతావా? రేపన్నది నీకు ఉందో? లేదో? తెలియనప్పుడు ఎందుకు నీ మదిలో వ్యధ?

ఆ పంచభూతాల సాక్షిగా  నిన్ను ప్రేమిస్తున్నాని చెప్పాలని ఉంది కానీ.. వాటికి కోపం వస్తే ప్రళయాన్ని సృష్టిస్తాయి.. అందుకే.. నువ్వే నా ప్రాణం అనుకుంటూ.. నా గుండెల్లో నింపుకున్న నీ ఊపిరి సాక్షిగా చెప్తున్నా.. నా మనసు,తనువు నీకే అర్పిస్తున్నా... కడవరకు నా తోడుంటావా😘😘😘😘

ఆవేశం

నా అనుకున్నవాళ్లని అర్థం చేసుకోవాలంటే ఆరాటం,ఆవేశం కాదు ఉండాల్సింది.. ఒక క్షణం ఆలోచన ఉంటే చాలు😐 ఆలోచన లేకనే ఎన్నో బాధలు..

సీత రాత

సీతనే వదిలేసిన రాతి హృదయాలున్న సమాజంలో.. గీతనే దాటలేని సీత హృదయాలెన్నో😒

నీకోసం

ప్రతి క్షణం లీనమైపోనా నీ ధ్యాసలో.. వేరెవ్వరికి చోటే లేదు నా మనసులో.. తియ్యని నీ ఊసులే కదిలే నా మదిలో.. నిన్ను విడిచి ఉండుట సాధ్యమా ఈ లోకంలో.. చివరి వరకు జంటై రానా మండే చితిలో....     బుజ్జి

కలం

కలానికి కళ్ళుంటే తప్పక కన్నీరు పెడుతుంది.. ఎందుకంటే.. సమాజంలో ఇన్ని ఘోరాలు జరుగుతున్నా.. మనిషిలా పుట్టిన మనం కనీసం స్పందించలేనందుకు.. ప్రతిదానికి తానే ముందుగా చలిస్తున్నందుకు😐 బుజ్జి..

ప్రేమ

నీపై నాప్రేమ మాటల్లో చెప్పలేనంత.. చేతల్లో చూపలేనంత.. ఆ మిన్ను కంటే ఎక్కువగా.. నేను మన్నులో కలిసిపోయేంత వరకు ప్రేమిస్తూనే ఉంటా కన్నా❤😘

నేను

నీ చెంపపై జారే కన్నీటిని కాను.. ఆ కన్నీళ్ళని తుడిచే ఓదార్పును నేను❤ నీ గెలుపు ప్రవాహంలో కానరాను.. నీ ఓటమి ఎడారిలో ఒయాసిస్సుని నేను❤ అప్పుడప్పుడు నీ ఇంటికి వచ్చే చుట్టాన్ని కాను.. నిత్యం నీఎదలో వినిపించే నీ మది శబ్దాన్ని నేను.. కంటిపాపలా.. కడవరకు.. చితిలో కూడా తోడుండే నీ ప్రాణాన్ని నేను😘 మరి పిల్లగాలులకే (అలక) ఎందుకు నీకీ ఉరుములు,మెరుపుల ఆవేశం.. చల్లగాలిలా నా దరి చేరితే చంటిపాపలా నీ మది వాలిపోనా.. నా బుజ్జికన్న❤😘

మది

మతి మరిచినా.. మది మరువని తలపులు ఎన్నో.. ఆ తలపుల తపనలలో నలిగే మనసులు ఇంకెన్నో......

జీవితం

నీ మనసులోని మాటని తెలుపగలిగే ధైర్యాన్ని.. ఎదుటివాళ్ళ మనసుని అర్థంచేసుకోగల సామర్థ్యాన్ని అలవర్చుకో.. అప్పుడే నీ జీవితం బాగుంటుంది😕

మనసు

కదులుతున్న కాలాన.. కదలిక తెలియని మనసుతో.. నీకై తపించడం తప్ప.. మరొకటి తెలియదు నాకు...

జీవితం

మనం బాగుపడాలంటే బలమైన కారణాలెన్నో కావాలి.. అదే బలవ్వాలనుకో ఒక్క బలహీనత చాలు!

దూరం

తనువుల మధ్య తపనకందని దూరం.. నీ తలపులతో తరగని నా ఆలోచనల వైనం.. తలవొద్దని,తపనొద్దని ఎంతగా అనుకున్నా.. తలుస్తూనే ఉన్నా నువ్వు కూడా నిన్ను తలవంతగా... నా బుజ్జికన్న❤😘

నాతో నువ్వు

నువ్వు నాతో ఉంటే కోరుకున్నవి లేకున్నా కావాల్సినవి ఉన్నట్టే.. ఓడి నే నిలిచున్నా.. నీ తోడు నను గెలిపించినట్టే❤😍 బుజ్జి❤

నీ ఊసులనే అక్షరాలుగా మలిచా.. నీపై నా ప్రేమను కలముగా చేశా.. నా గుండెచప్పుడే నీవని తలిచా.. నా కవితా కుసుమాలతో అనుక్షణం నిన్నే కొలిచా కన్నా❤

మగువ

నువ్వు పొందాలనుకునే పైశాచిక క్షణిక సుఖం విలువ ఆడదాని జీవితం.. తొమ్మిది నెలలు నిను మోసి ప్రాణాన్ని కూడా లెక్క చేయని తన త్యాగమే నీ జననం👍

నాన్న

మనం కింద పడిపోతుంటే పట్టుకుంటాడు.. మనల్ని నలుగురిలో గొప్పగా ఉంచాలనే తపనతో.. మనం ఎదగాలన్న ఆశతో.. నిరంతరం శ్రమిస్తూ తానెప్పుడూ కిందనే ఉండిపోతాడు🙏

ప్రేమ

ప్రేమకి,ద్వేషానికి దూరమెంతో తెలుసా.. నీవల్ల వచ్చే కన్నీటికి.. నీకోసం వచ్చే కన్నీటికి మధ్య నువ్వు చేసే ప్రయణమంత!

నీతో జీవితం

అమ్మకి తొమ్మిది నెలలతో ఏర్పడిన బంధం నాన్నకి పాతికేళ్ల బాధ్యతతో పెంచుకున్న జీవితం.. మరి ఒక అబ్బాయితో మాత్రమే తన ఎనభైయేళ్ళ జీవితం.. అమ్మానాన్న,తోబుట్టువులు వీళ్ళందరు ఎప్పుడొకసారి దూరం ఉండాల్సిందే.. మనసుకి నచ్చి,మనువాడిన అబ్బాయితో మాత్రమే ఊపిరి ఉన్నంతవరకు సాగాలి తన పయనం.. అందుకే తనే సర్వం,ప్రాణం❤    #బుజ్జి❤

నువ్వు

నీది కానిదేది లేదు నాలో.. నిజానికి నేనున్నది నీలో❤

సమాజం

వాళ్ళకి నచ్చింది మాత్రమే వినడానికి ఇష్టపడే ఈ సమాజంలో... నీకు నచ్చింది నిన్నెలా చేయనిస్తారు.. నీకు నచ్చినట్లు నువ్వే కదా బ్రతకాలి.. నీకు కావాల్సింది నువ్వే కదా వెతకాలి.. మరి ఎవరో ఏదో అనుకుంటారని ఎందుకు ఆగిపోతున్నావు? నీకు నచ్చింది సాధించడానికి నిజాయితీగా ముందుకెళ్లు.. విజయం నీ చెంత చేరుతుంది! బుజ్జి😍

కన్నవాళ్లు

కన్నబిడ్డ కాటుక కరిగేలా కన్నీరు కారుస్తుంటే.. మీరు కన్యాదానం ఎలా చేస్తారు? మనసుకు నచ్చని వాడితో మనువుచేసి.. బంధానికి బలిచేసి.. మీ బాధ్యత తీరిపోయిందని ఎలా అనుకుంటారు? మీ మీద గౌరవంతో.. మీ పరువుకి,మీ ప్రాణానికి విలువిచ్చి.. తను ప్రాణం అనుకున్నోడిని బలి చేసి.. తన జీవితాన్ని మీకు కానుకగా ఇచ్చి మీ రుణం తీర్చుకుంటుందే.. మీ పరువు కంటే తన మనసుకు నచ్చినవాడితో తన సంతోషమే ఎక్కువ అని మీకు ఎందుకు అనిపించదు? మీరు తల ఎత్తుకు తిరగాలని.. మనసు చంపుకుని.. బ్రతికున్న శవంలా.. తలదించుకుని ఎవడితోనో తాళి కట్టించుకుంటుందే.. తన సంతోషాన్ని కాదన్నమనే బాధ మిలో ఉండదు ఎందుకు? ఎన్నాళ్లీ పరువు? ఎన్నాళ్లీ కులమతాలు? గుండెల్లో పెట్టుకున్నాం లక్షలు అప్పుచేసైన అల్లుడిని కొనివ్వాలి అనుకోకండి.. నువ్వు కొనిచ్చే అల్లుడితో ఆడుకోవడానికి నీ కూతురు బొమ్మ కాదు.. తన మనసుకి నచ్చినోడితో పెళ్లిచేసి.. తన సంతోషంలో మీ అమ్మని చూసుకోండి.. అవును నిజమే ఇప్పుడున్న ప్రేమలు చాలావరకు కలిసి తిరగడం వద్దే ఆగిపోతున్నాయి.. అలాగని నీ కూతురిని అలాగే చూడకు.. ఒక్కసారి ఆలోచించి తనకి ఆనందాన్ని అందించు.. కూతురు ప్రాణం అంటారు ఎన్నెన్నో

కష్టం

పక్కనోడి కష్టం నీకు ఎప్పుడు చులకనే.. అదే కష్టం నిన్ను పలకరిస్తే నీకు చెమటలే!

ఇష్టం

కారణాలు లేకుండానే ఇష్టపడతాం.. కారణాలు వెతుక్కుని మరీ విడిపోతాం.. కాలంతోపాటు మర్చిపోతాంలే అనుకుంటాం.. అది అంత తేలికా!😏

నువ్వుంటే చాలు

తెలియని దారుల్లో.. తరగని పయనంలో.. అలిసిన వేళల్లో.. నా బాధల నిట్టూర్పులో.. నువ్వుంటే చాలు.. నా మదిలో చిరు ఆశల దీపాలు వెలిగించడానికి❤ బుజ్జి😍

ప్రేమ

ప్రేమించడంలో నిన్ను మించిపోవడం తెలుసు తప్ప.. నిన్ను మించి వేరేవాళ్లను ప్రేమించడం నాకు తెలియదు కన్నా❤

వేదన

చీకటితో నిండిన రాత్రి నుండి వేకువ.. సూర్యుడు లేలేత కిరణాలకి తాళలేక.. వదిలివెళ్లినంత సులభంగా.. కొన్ని మనసుల్లో నిండిన వేదన వెల్లదు.. ఎందుకో మరి😏😔

బంధం

మాట్లాడే మాటల్లో కొన్ని భావాలు మాత్రమే చెప్పగలం.. మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను మదిలో మోయలేక,బయటకి చెప్పలేక మౌనంగా రోధిస్తుంది మనసు.. ఆ మనసుని అర్థం చేసుకోవడం ఎందరికి తెలుసు?

బంధం

మనల్ని మనలా Accept చేయలేని ఏ బంధమైనా సరే ఎక్కువకాలం ఉండదు.. బంధం అంటే లొంగి ఉండటమో.. లొంగిపోవడమో కాదు.. ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకెళ్లడం❤

ప్రజాస్వామ్యం

వంచకులను ఎన్నుకొని.. అణిచివేతల రాజకీయం అనుభవిస్తూ.. కుళ్ళిపోయిన సమాజమని తిట్టుకుంటూ.. గుండెమంటలు కాచుకుంటు.. ఇంకెన్నాళ్లు బానిసగా ఉంటావు.. పౌరుషం లేదా.. అన్యాయాన్ని ఎదిరించే సత్తా లేదా.. లే.. ఇకనైనా.. మనిషిగా పుట్టినందుకు మానవతా విలువలు పెంచుకో

జీవితం

గాలిచేత గాయాలు తిన్న ఆకులా ఎగిరిపోకు.. సముద్రాలే ఎండిపోతున్నాయి నీ కన్నీళ్లొక లెక్కా! "ప్రవహించే కాలంలో పరిగెత్తే రంగుల చేప మన జీవితం" కన్నీళ్ల వలలో పడదు.. కలల గాలానికి తగలదు.. బాధలో మునిగిపోతూ.. సంతోషాల్లో ఉదయించు☺👍

ప్రేమ

అలిసిన నా మనసుకి.. నీ మాటల అలజడి చాలు.. సముద్రంలోని కెరటంలా ఎగిసి పడటానికి....

నీకై నేను

నీకు దూరమైన దూరాన్ని ప్రేమిస్తున్నా.. ఎప్పటికైనా నిన్ను నా దగ్గరగా చేస్తుందని.. నా కళ్ళలో నీకోసం వచ్చే కన్నీటిని కూడా ప్రేమిస్తున్నా! ఏదొకరోజు నా పెదాలపై చిరునవ్వుగా చేరతావని❤ అలిసిపోతున్న నా ఎదురుచూపుల్ని ప్రేమిస్తున్నా! ఎప్పుడైనా నా కళ్ళముందు నిలుస్తావని.. అనుక్షణం నీకై స్పందించే నా గుండెచప్పుడుని ప్రేమిస్తున్నా.. ఏ క్షణమైనా నాప్రాణంగా ఎదురొస్తావని.. ఇలా ఊహల్లో జీవించడం తప్ప నేను నీ ఊపిరిగా మారేదెప్పుడో.. నీతో జీవితాన్ని పంచుకునే క్షణం కోసం.. అనుక్షణం నీ ధ్యాసలో నీకోసమే నిరీక్షించే నీ బుజ్జి❤

నీకై

భారమైన క్షణాలలో నీకై నిరీక్షణ.. మౌనమైన నీ సమక్షంలో మాటలకై నా అన్వేషణ❤    బుజ్జి❤

నువ్వు

వేలమందిలో నేనున్నా నను వెంటాడే ఏకాంతం నువ్వు.. నన్ను నాక్కూడా దక్కనివ్వని నా పంతం నువ్వు.. ఎన్నటికీ వీడని నా మరో నేనే నువ్వు❤