నీకై నేను

నీకు దూరమైన దూరాన్ని ప్రేమిస్తున్నా..
ఎప్పటికైనా నిన్ను నా దగ్గరగా చేస్తుందని..

నా కళ్ళలో నీకోసం వచ్చే కన్నీటిని కూడా ప్రేమిస్తున్నా!
ఏదొకరోజు నా పెదాలపై చిరునవ్వుగా చేరతావని❤

అలిసిపోతున్న నా ఎదురుచూపుల్ని ప్రేమిస్తున్నా!
ఎప్పుడైనా నా కళ్ళముందు నిలుస్తావని..

అనుక్షణం నీకై స్పందించే నా గుండెచప్పుడుని ప్రేమిస్తున్నా..
ఏ క్షణమైనా నాప్రాణంగా ఎదురొస్తావని..

ఇలా ఊహల్లో జీవించడం తప్ప నేను నీ ఊపిరిగా మారేదెప్పుడో..
నీతో జీవితాన్ని పంచుకునే క్షణం కోసం..
అనుక్షణం నీ ధ్యాసలో నీకోసమే నిరీక్షించే నీ బుజ్జి❤

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం