Posts

Showing posts from February, 2020

..

Image

ఆవేశం

Image

అమ్మనాన్న

తమకంటూ ఒక జీవితం ఉందని.. తమకే తెలియని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే.. అది అమ్మానాన్న మాత్రమే🙏 అనుక్షణం మన ఆనందానికి తపిస్తూ,కష్టించే వాళ్ళకి ఏమివ్వగలం.. మన ఊపిరి ఉన్నంతవరకు వాళ్ళ మనసుని కష్టపెట్టకుండా ఉండటం తప్ప......

జవాన్

Image
తూటాల వర్షం కురుస్తున్న తోటి సైనికుల ఆర్తనాదాలు వినిపిస్తున్నా రక్తం ఏరులై పారుతున్నా.. ఎక్కడికక్కడ శవాల గుట్టలు కనిపిస్తున్నా.. కన్నపేగు మమకారం కళ్ళముందు కదులుతున్నా.. వెనుతిరగక.. వెన్ను చూపక.. మీ ప్రాణాలొడ్డి పోరాడుతూ దేశాన్ని కాపాడే సైనికా.. అందుకు నా అక్షర నివాళి🙏😢

రైతు

Image
పండించిన పంటే నెత్తుటికత్తిగా మారి.. కుత్తుక కోస్తుందని నమ్మలేక.. చెంపలపై జారిపడుతున్న కన్నీటికి బదులు చెప్పలేక.. గుండెలో కొండంత ఆవేదనని మోస్తూ.. భర్తవెళ్లిన దిక్కునే ఎదురుచూస్తుందామె.. తెగిపడిన మెళ్లోని పసుపుతాడు అతుక్కుంటుందేమోనన్న ఆశతో😢😢😢😢 #రైతు🙏

😒

మనం ఎదుటివాళ్ళకి ఏమి ఇస్తే అదే మనకి తిరిగి వస్తుందంటారే.. మనం అంతులేనంత ప్రేమని పంచి.. విడిపోలేనంత బంధాన్ని పెంచుకుంటే.. మనకి చివరికి కన్నీరే తిరిగి వస్తుంది ఎందుకో?

మౌనం

మౌనమే నా నేస్తమైనప్పుడు.. ఒంటరితనమే తోడుగా మిగిలినప్పుడు.. అక్షరాలే నా బాధని పంచుకుంటున్నప్పుడు.. నాకెవరు లేరనే బాధ ఎందుకు? ఒంటరితనమని దిగులు ఎందుకు......

కలం

కలాన్ని కరమున పట్టి.. కాగితాన్ని కవచంగా చేసుకుని.. అక్షరాలే ఆయుధాలుగా.. నా మదిలో బాధలు,భావాలే ఇంధనంగా.. మరణంతోనే చేస్తా అవిరామరణం.. మరణం కూడా ఆపలేదు నా అక్షర యుద్ధం✍

కలం

నేను కలమై.. నా ఊపిరితో నీకు లేఖలు రాశా.. నా కన్నీళ్లుగా మారిన నువ్వు.. కాగితంపై రాసిన నా రాతలను చేరిపేస్తున్నావు..

దూరం

రెండు మనసుల మధ్య దూరం పెరగాలంటే గొడవలు జరగక్కర్లేదు.. మాటలని బందిస్తూ మౌనం ఉంటే చాలు.. దూరమైపోవడానికి...

నాన్న❤

Image
జీవితం అంటే పులపాన్పు కాదు.. ముళ్ళు కూడా ఉంటాయని నాకు ఇప్పటివరకు తెలీదు.. ఎందుకంటే.. నా కాళ్లకు పూలు తప్ప ముళ్ళు కనిపించలేదు ఇప్పటివరకు.. కారణం.... నా ప్రతిసంతోషం వెనుక నీ చెమట చుక్కలు ఉన్నాయని.. నీ రుణం తీర్చాలి అంటే నా జీవితాంతం నీకోసం ఏం చేసినా అది సరిపోదు.... నీ ప్రేమని అక్షరాలుగా మారుస్తూ నా మనసు రాసే ఈ పిచ్చిరాతలు సరిపోవు.. నన్ను నీ భుజాలపై ప్రేమతో మోస్తున్నందుకు.. నా జీవితాన్ని నీ చెమటతో రాస్తున్నందుకు.. నా ప్రతిసంతోషాన్ని నీ త్యాగంతో ఇస్తున్నందుకు.. నా జీవితం నీకే అంకితం నాన్న.. ఈ జన్మలో అయితే నీ రుణాన్ని తీర్చలేను.. మరొక జన్మంటూ ఉంటే.. నీకు నాన్ననై తీర్చుకుంటా.. నువ్వెప్పుడు అంటూ ఉంటావు నేను మీ అమ్మను అని.. ఇప్పుడు అమ్మనో కాదో తెలీదు కానీ.. మరుజన్మకి నీలాంటి నాన్నగా పుట్టించమని కోరుకుంటున్నా.. నాకు బాధ కలిగినా,సంతోషం కలిగినా గుర్తొచ్చేది నువ్వే నాన్న.. ఆవేశంతో,ఆలోచన లేకుండా దారితప్పుతున్న ప్రతిక్షణం నీ మాటలే నన్ను నడిపిస్తున్నాయి.. ఒక్కోసారి అనిపిస్తుంది.. నేను లేని నీ బ్రతుకు ఎలా ఉంటుందోనని.. ఎన్ని బాధలు వచ్చినా.. ఎంత కష్టం వచ్చినా.. నిన్ను నేనెప్పటికి ఒంటరిని చేస

మాట మనసు

చెంపపై జారుతున్న ఒక కన్నీటి చుక్క మనసులో ఉన్న మాటని అడిగిందట.. నీకు బాధ కలిగినప్పుడు నువ్వు రాకుండా నన్నెందుకు బయటకి పంపిస్తావని... అప్పుడు మాట ఇలా అనిందట.. కళ్ళల్లో నుండి కన్నీళ్లుగా నువ్వు బయట పడితేనే మనసు తేలిక అవుతుంది.. బాధగా ఉందని నేను పెదవి దాటితే ఎదుటిమనసు గాయపడుతుంది.. ఆవేశంలో,ఆలోచనలేని మాట కత్తి కంటే చాలా పదునైనది.. మనిషిని,మనసుని నిలువెల్లా చంపుతుంది.. అందుకే నేను రాకుండా నిన్నే పంపిస్తున్నానని చెప్పిందట.. మనసులో ఉన్న మాట ఎంత గొప్పదో కదా....

సమస్యలెన్నోచినా.. గొడవలెన్ని జరిగినా.. కష్టంలోను.. సుఖంలోను.. ప్రతి విషయంలో.. ప్రతిక్షణంనీ ఊపిరిలా నీవెంటే ఉంటా.. అమ్మలా ప్రేమిస్తూ.. నాన్నలా నడిపిస్తూ.. తప్పొప్పులు సరిచేస్తూ.. చెల్లిలా ఆదరిస్తూ.. భార్యలా సేవిస్తూ.. నీ ప్రతిపనిలో నేనుంటా.. నా ఊపిరి ఆగువరకు నీ ఊపిరిలా మారి నీవెంటే ఉంటానని.. ప్రమాణం చేస్తున్నా... #HappyPromiseDay ❤😘

నువ్వు నా నీడవి కాదు.. ఎందుకంటే అది వెలుగు ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తుంది.. చీకటిలో వదిలేస్తుంది.. చీకటి వెలుగులతో కాకుండా.. నీ పేరే నా ఊపిరిలా.. నీ ప్రేమే నా గుండెచప్పుడులా చేసుకున్నా.. ఎందుకంటే అవి ఆగిపోతే నా ప్రాణం పోయినట్లే.. నీ ప్రేమ,నువ్వు నాతో లేకపోతే నేను బ్రతికున్నా లేనట్లే.. Love u so much😘 #HappyProposeDay❤

?

మాటలెన్నో చెప్తావ్ చెప్పలేనంత ప్రేమ చూపిస్తావ్.. మరి అంతలోపే మనసును గాయపరిచే మాటలతో మారిపోతావు ఎందుకో?

😑

గాలి కూడా దూరనంత దగ్గరై.. గాలి కూడా ఆడనంత దూరం అవుతున్నట్లున్నావు.. గాయమని తట్టుకోవాలా... గాల్లో కలిసిపోవాలా చెప్పు...

ప్రేమ

నేను రోజు పెట్టుకునే కుంకుమబొట్టుకి నువ్వే కారణం లా ఉండాలి అనుకున్నా.. కాని.. నేను కార్చే ప్రతి కన్నీటిబొట్టుకి నువ్వే కారణం అవుతున్నావ్ రాలే ప్రతి కన్నీటి బొట్టు బాధపడట్లేదు.. నీకోసం ఏడ్చేంత ప్రేమని నాకు నువ్వు పంచినందుకు గర్వపడుతుంది...

మనసు

మనిషి శరీరానికి అయ్యే గాయాలకు మందు కనిపెట్టారు మనసుకి గాయం అయితే మందులేదు మరుపు రాదు మరణం వరకు అంతే.......

మగువ

ఆడదాన్ని కొంటే అది వ్యభిచారం అంటారు మగాడిని కొంటే కట్నం అంటారు రెండింటిలో మగాడికే ఎక్కువ అవసరం కానీ.. బలి అయ్యేది మాత్రం ఆడదే

నాన్న

నాన్న అంటే బంధం మాత్రమే కాదు భరోసా.. నీ వెనుక వెన్నుముకలా నాన్న ఉన్నాడనే భరోసా నలుగురిలో నిన్ను భయం లేకుండా నడిపిస్తుంది నిన్ను ముందుకు నడిపించి నాన్న వెనుకే ఉండిపోతాడు.. అందుకే ఆయన్ని ఎప్పుడు తక్కువ చేయకు,చూడకు😘