Posts

Showing posts from May, 2020

విలువ

నీకు,నీ మాటలకి విలువ ఇవ్వాలనుకోని వ్యక్తులపై.. పిచ్చి ఆశతో,అతి ఆరాటం చూపిస్తే.. వాళ్ళ దృష్టిలో నీపై చిరాకు,విసుగు కలిగి.. ఉన్న విలువ కూడా పోగొట్టుకుంటావు.. అందుకే సహనంతో ముందుకెళ్లు.. వాళ్ళు నీతో ఉండే తీరునిబట్టి వాళ్ళకి నీవల్ల ఇబ్బంది కలుగకుండా నడుచుకో...

దైవం

కన్నీళ్లతో నిండిన జీవితానికి... మనసుతో ముడిపడిపోయేలా బంధాన్ని ఇచ్చావు.. కానీ.. నీకు ఏది శాస్వితం కాదని నీ ఒంటరితనమే శాశ్వితమంటూ.. ఇచ్చినట్లే ఇచ్చి నీకు నచ్చినట్లు దూరం చేస్తున్నావు.. ఎంతవరకు న్యాయమో.. నేను అడిగానా నాకో బంధం కావాలని.. ఎవరెవరి జీవితాలో బాగుచేసేకి నాతో బంధాలను ముడివేసి.. అన్ని చక్కదిద్ది ఈరోజు నన్ను మళ్ళీ ఒంటరీదాన్ని చేస్తున్నావు... ఎవరులేని ఏకాకిగా మిగిలిస్తున్నావు.. నీ ఆటలో నన్నొక పావును చేసి ఇష్టమొచ్చిన్నట్లు ఆడుకుని విసిరేస్తున్నావు.. ఏ నేను మనిషిని కాదా.. నీకు బొమ్మని అయ్యానా.. క్షమించరాని తప్పులు చేసినోళ్ళని చల్లగా చూస్తూ.. కన్నీళ్లతో నా కడుపు నింపుతున్నావు.. నా అనేవాళ్ళని నాకు ఒక్కరినీ కూడా లేకుండా చేస్తూ పైన కూర్చుని పరహాసిస్తూన్నావు.. ఇలా చేయడం కంటే నన్ను నీతో తీసుకెళ్ళొచ్చుగా.. ఈ బాధల బంధాల నుండి శాస్వితంగా నీతో తీసుకెళ్లు దేవుడా.. ఇంత చిన్న గుండెల్లో అన్ని కష్టాల భారాన్ని మోయలేక కన్నీళ్లు కూడా ఆవిరైపోతున్నాయి.. కాస్త జాలిపడు నాపై.. నీతో తీసుకెళ్లు తండ్రి!

దైవం

ప్రాణమనకున్న మనిషి.. పరిస్థితుల్ని బట్టి మనపై చూపే ప్రేమలో కాస్త తేడా కనిపించినా... గుండె తట్టుకోలేదు.. దూరం పెడుతున్నావా.. దూరమై పోతున్నావా అని నిలదీస్తే నాపై చిరాకు వస్తుందని భయం.. మౌనంగా భరిస్తే నానుండి దూరమైపోతావని బాధ... ఇవన్నీ భరిస్తూ బ్రతకడమెలాగో.. గమ్యం తెలియని పయనాన్ని సాగించడమెలాగో..

జీవితం

నిన్నటి నందనవమైన నీ బ్రతుకులో నేడు ఎండమావులు... ఎండిన మోడులే చిగురులు వేసేలా బ్రతికి చూపించు

జీవితం

జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొవాలంటే.. కావాల్సింది సమయమో,సత్థువో కాదు.. సహనం కావాలి... ఈరోజు కన్నీళ్లతో బాధపడొచ్చు కానీ... రేపన్నది మాత్రం నీదే నిజాయితీగా నువ్వు ముందుకెళ్తే చాలు..

అమ్మ

Image
అమ్మ ఈ పదం ఎంతో గొప్పది.. తన కన్నీళ్ళని దాచి నాకు నవ్వులు పంచింది.. అలిగితే బుజ్జగిస్తూ గోరుముద్దలు పెట్టింది.. దిగులుతో నేనుంటే తన ఒడి ఊయల ఊపింది.. మొండిలో బ్రతిమాలుతూ.. నా తప్పొప్పులు సరిచేస్తూ.. నా బంధం నుండి తప్పించుకుంటూ బాధ్యతలు నేర్పింది.. ఒంటరిగా వదిలి వెళ్తున్నా ఈ మృగాల మధ్య ఎలా ఉంటావో అంటూ కన్నీళ్ళతో నన్ను సాగనంపింది.. గుండెల్లో చెప్పుకోలేనంత బాధని కడవరకు మోస్తూ బ్రతకమని ఒక బంధాన్ని ఇచ్చి కనుమరుగైపోయింది.. నా అనే తోడు కరువై కన్నీళ్ళతో బ్రతికే నాకు తాను ఎక్కడో ఉంటూ కంటికి రెప్పలా కాచుకుంటుంది.. మళ్ళీ జన్మంటూ ఉంటే నాకు ఇలాంటి జన్మ ఇవ్వకమ్మా అంటూ కన్నీళ్ళతో అడుగుతున్నా.. నిజంగా దేవుడే ఉంటే.. గడిచిన కాలాన్ని ఇవ్వమని.. నా అమ్మను నాకు తిరిగి ఇవ్వమని బ్రతిమాలుతున్నా.. తన ఒడిలో బుజ్జయిలా నిదురపోవాలి.. నా గుండెల్లో మోస్తున్న భారాన్ని కన్నీళ్ళతో చెప్పుకోవాలని.. అనునిత్యం నా ఆలోచనల్లో కదులుతూ.. ప్రతిక్షణం నా కన్నుల తడిలో కనిపిస్తూ.. నను నడిపించే అమ్మానాన్నలకి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి.. ఈ కన్నీళ్లు ఎవరితో పంచుకోవాలి.. మీరేమో నన్నొదిలి ఎక్కడో ఉన్నారు.. కనీసం నా కన్నీళ్లు తుడిచేకి కలలోనైన

అమ్మనాన్న

అమ్మలేని బ్రతుకు ఎంత నరకమో.. నాన్నలేని పయనం ఎంత కష్టమో.. అమ్మానాన్నతో గడిపిన కాలం వెనక్కి వస్తే ఎంత సంతోషమో.. అలుపన్నదే లేని బాటసారిలా ఈ పయనం ఇంకెంత కాలమో....

కన్నీరు

ఈ భరితెగించిన బాధని చూడు.. కనుల సరిహద్దులు దాటి చెంపను తడుపుతుంది.. కనికరం లేని కన్నీళ్లు ఎంత ఆపినా ఆగట్లేదు.. సంతోషమన్నది ఇక నాకు కలేనా..

😑

కన్నుల లోయలలో జలపాతం.. మది అగాధంలో విషాదం.. వెలివేసిన వసంతం... వెలుగారుతున్నది నా ప్రాణం... ఇదే నా జీవితం...

జీవితం

వేలమంది చుట్టూ ఉన్నా వెంటాడే ఏకాంతం.. జారి పాతాళానికి పడిపోతున్నంత విషాదం.. ఏనాటికి చేరెను నా జీవితం సుఖాంతం..

😑

చీకటైన నా జీవితంలో రేపటి సూర్యోదయాన్ని చూడబోతున్నా అనుకునేలోపే గ్రహణం పట్టుకుంది...

కలం

Image
కలం కదలనంటోంది.. కవిత పలకనంటోంది.. కథలెన్నో చెప్పాలనున్నా.. కలలెన్నో చూపాలనున్నా.. కలగన్న కల కలదో లేదోనని.. కథలన్నీ కడకు కన్నీటి వ్యధలేనని.. తెలిసి... నా కలం కదలనంటోంది....

😐

కలిసి కట్టుకున్న కలల సౌధంలో.. ఒంటరినై.. వెలుగులోనూ చీకటినే చూస్తున్నా.. ఆనాటి గుర్తులు మనసుని ముల్లులా గుచ్చేస్తున్నా.. గులాబీలా గుబాలిస్తున్నా..

నా కథ

నిరాశ నీడలో.. నిశీధి తోడులో.. స్మశాన వైరాగ్యంలో.. ప్రశాంత ఏకాంతంలో.. ఒంటరాయెను నా మది.. ఓడిన కథేగా నాది😕

నాలో నువ్వు

ఆవేశం,కోపం,అనుమానం, ద్వేషంతో నువ్వే ప్రపంచమనుకుని  బ్రతికే ప్రాణాన్ని కాలదన్నుతున్నావు.. నిన్న అనేరోజుని గుర్తుతెచ్చుకో నీకై ఎంత తపించిందో.. నాడు నీకు పునర్జన్మనిచ్చిన మరో అమ్మ.. నేడు నీ అనుమానవు పొరలకు నువ్వు ఆడుకునే బొమ్మ అయింది.. రేపు నువ్వు కావాలనుకున్న తిరిగిరానంత దూరం వెళ్ళిపోయింది.. విధి ఆడిన ఆటలో ఆడి అలిసి మూగబోయింది......

కథ

కార్చే ప్రతి కన్నీటిబొట్టు వెనుక.. కంటికి కనిపించని కథ ఒకటి ఉంటుంది.. కన్నీళ్లు కారడమే తప్ప.. ఆ కథ మాత్రం కరగదు.. ముగింపు ఉండదు....

బంధం

బంధాలన్ని బూటకాలే.. జీవితమనే నాటకరంగంలో...

కన్నీటి జాడలు

వేసవిలో కురిసిన వర్షం గొంతు తడవకుండానే నేల తడారిపోయినట్లు.. కొందరు.. మనం కోరుకోకుండానే.. మన ప్రమేయం లేకుండానే మన జీవితంలోకి వచ్చి మన గుండెను కోటి ఆశలతో తడిపి వెళ్ళిపోతారు.. విచిత్రమేంటంటే.. వేసవి ఆవిర్లకు ఆ నీటి జాడలు ఆరిపోతాయి.. కానీ.. బాధతో మన గుండెకు అంటుకున్న కన్నీటి జాడలు మాత్రం ఎన్నటికీ ఆరిపోవు.. బ్రతికనంతకాలం మది సంద్రమై జ్ఞాపకాలతో తడుపుతూనే ఉంటుంది..

నువ్వు

నిన్ను నన్ను కలిపిన ఆ నిన్నను నిందించాలా.. కన్నుమిన్ను కానని ఆ మొన్నను ద్వేషించాలా.. నేడు నాతో నువ్వు లేవని నన్ను నేను దూషించాలా.. ఆశలేని రేపటివైపు పయనం సాగించాలా.. లేక ఈ జీవితం ముగించాలా... అర్థం కావడంలేదు......

నువ్వు

నిన్నలోని నిన్ను తలచుకుంటూ.. నేడు నీ జ్ఞాపకాలు మోసుకుంటూ.. ఆశలేని రేపు వైపు అడుగులు వేస్తున్నా..

నమ్మకం

నమ్మకమైన బంధం నుండి ప్రేమ పుడుతుంది.. నువ్వు అనుమానం అనే సంకెళ్లు వేశావనుకో.. మళ్ళీ నువ్వు కావాలనుకున్నా అందనంత దూరం వెళ్ళిపోతుంది ఆ "ప్రేమ"

మరణం

మరణానికి కూడా మరణమనేది ఉంటే తెలిసొచ్చేది.. మన అనే తోడులేని బ్రతుకులో మనసు మరణిస్తే కలిగే బాధేంటో..

🙏

అడుగులు కూడా తెలియని నా కాళ్లకు.. దారిని చూపి.. అంధకారమైన ముళ్ల దారిలో వదిలేశావు

కార్మిక దినోత్సవం

అవసరానికి ఆదుకునేవారులేక గనుల్లో పనిచేస్తూ.. తమ జీవితాల్ని పణంగాపెట్టి పొట్టనింపుకునే కార్మికులు.. ప్రపంచానికి ఆకలి తీరుస్తు తమ కడుపులు ఖాళీగా ఉంచుకుంటు.. రేయనకా,పగలనకా కష్టించి ఆఖరికి తమ తనువులి పుడమితల్లి ఒడిలో కలిపే కర్షకులు.. ఏ తల్లి ఏ చెత్తకుప్పలో పడేసిందో తన బ్రతుకు ఎంగిలివిస్తళ్లతో మొదలై.. మనసులేని రాతి మనుషులమధ్య రాళ్ళుమోస్తూ పొట్టనింపుకునే బాలకార్మికులు.. వీళ్ళందరి పెదవుల్లో నవ్వులు చిందినరోజే మనది అసలుసిసలైన భారతం.. మన ప్రతిపనిలో తాముంటూ.. తమ జీవితాలు అట్టడుగున చిదిమేసుకుంటున్న ప్రతి కార్మికుడికి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు