దైవం

కన్నీళ్లతో నిండిన జీవితానికి...
మనసుతో ముడిపడిపోయేలా బంధాన్ని ఇచ్చావు..
కానీ..
నీకు ఏది శాస్వితం కాదని నీ ఒంటరితనమే శాశ్వితమంటూ..
ఇచ్చినట్లే ఇచ్చి నీకు నచ్చినట్లు దూరం చేస్తున్నావు..
ఎంతవరకు న్యాయమో..
నేను అడిగానా నాకో బంధం కావాలని..
ఎవరెవరి జీవితాలో బాగుచేసేకి నాతో బంధాలను ముడివేసి..
అన్ని చక్కదిద్ది ఈరోజు నన్ను మళ్ళీ ఒంటరీదాన్ని చేస్తున్నావు...
ఎవరులేని ఏకాకిగా మిగిలిస్తున్నావు..
నీ ఆటలో నన్నొక పావును చేసి ఇష్టమొచ్చిన్నట్లు ఆడుకుని విసిరేస్తున్నావు..
ఏ నేను మనిషిని కాదా..
నీకు బొమ్మని అయ్యానా..
క్షమించరాని తప్పులు చేసినోళ్ళని చల్లగా చూస్తూ..
కన్నీళ్లతో నా కడుపు నింపుతున్నావు..
నా అనేవాళ్ళని నాకు ఒక్కరినీ కూడా లేకుండా చేస్తూ పైన కూర్చుని పరహాసిస్తూన్నావు..
ఇలా చేయడం కంటే నన్ను నీతో తీసుకెళ్ళొచ్చుగా..
ఈ బాధల బంధాల నుండి శాస్వితంగా నీతో తీసుకెళ్లు దేవుడా..
ఇంత చిన్న గుండెల్లో అన్ని కష్టాల భారాన్ని మోయలేక కన్నీళ్లు కూడా ఆవిరైపోతున్నాయి..
కాస్త జాలిపడు నాపై..
నీతో తీసుకెళ్లు తండ్రి!

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం