Posts

Showing posts from December, 2019

...

మాటను బట్టి ఇష్టాన్ని.. కళ్ళను బట్టి కష్టాన్ని తెలుసుకుని.. నీకు అండగా ఉండేవాళ్ళు దొరకడం నీ అదృష్టం... నీ గెలుపులో తన ఆనందాన్ని వెతుక్కున్నప్పుడు.. తన కష్టంలో నీ బాధ్యతని పంచుకోలేవా.. అలా పంచుకుంటేనే కదా బంధం ఎప్పటికి పదిలంగా ఉండేది.....

😒

ఎదుటివాళ్ళకి మనం ఏమిస్తే అదే తిరిగి వస్తుంది అంటారు.. అంతులేనంత ప్రేమని పంచి.. విడిచి ఉండలేనంత బంధాన్ని పెంచుకుంటే.. మనకి మాత్రం కన్నీళ్లే వస్తాయి.. ఎందుకో మరి?

...

నీకోసం కన్నీళ్లు రావడానికి.. నీవల్ల కన్నీళ్లు రావడానికి చాలా తేడా ఉంది.. అది తెలుసుకుని,అర్థం చేసుకుని కన్నీళ్లు రాకుండా చూసుకుంటేనే బంధం బలపడుతుంది..

...

గ్రహణం విడిచిన సూర్యుడు ఎంత ప్రకాశవంతంగా ఉంటాడో... నాతో ఉన్న క్షణాన నీ పెదవంచున మెరిసే చిరునవ్వుకే తెలుసు.....

కలం

కాలం కదలని క్షణం.. చెప్పుకోవడానికి ఎంతో ఉన్నా. వినడానికి మనసులేని సమయంలో.. "కలం"తో కాలాన్ని గడుపుతూ.. అక్షరమై మళ్ళీ మళ్ళీ పుట్టి.. కన్నీటిబొట్లతో సేదతీరుతున్నా.....

కలం

నా కలం కదలని క్షణం... నా కళ్ళల్లో కన్నీటి సాగరం.. నా జీవితమే అలజడులమయం.. కాదేదీ చావుకు మించిన వరం..

బంధం

నేను నేలలాంటిదాన్ని.. నువ్వు నన్ను భారంగా తొక్కినా.. బలంగా నొక్కినా.. నిన్ను భరించి బాధ్యతగా నీకు ప్రేమని పంచడమే తెలుసు.. నీతో నాకున్న బంధాన్ని మధ్యలో తెంచడం తెలీదు!

అమాయకంగా ఉన్న నా జీవితంలోకి అద్బుతంలా వచ్చావు.. మనసుని మాటలుగా మార్చడం రాకపోయినా నా మనసుని చదివేశావు.. నువ్వు నాతో ఉండే ప్రతిక్షణం నా పెదాలపై కనిపించే చిరునవ్వు చెప్పింది.. ఇక నువ్వుంటే చాలని.. ఈ ప్రపంచమే చిన్నదని..

...

మరణమే ఇద్దరిని వేరు చేసేది అంటారు.. నిజానికి మనసును గాయపరిచే మాటలవల్లే ఇద్దరు దూరం అవుతున్నారు.. బంధం బలహీనం అవుతుంది... ఎంత అర్థం చేసుకోవాలి అనుకున్నా ఏదొకచోట కన్నీళ్లు వస్తుంది... మరి అలాంటప్పుడు మరణాన్ని నిందించడం ఎందుకు? మనసును గుచ్చేలా మాటలు ఎందుకు?

..

దగ్గరగా ఉంటూ నీకు అలుసై పోవడం కంటే.. దూరంగా వెళ్ళిపోయి ఒక జ్ఞాపకంగా మిగలడమే నాకిష్టం❤

నీకై

పయనం ఎంత దూరమైనా నా గమ్యం నువ్వైతే చాలు.. దూరాన్ని లెక్కచేయకుండా నిన్ను చేరుకుంటా.. కష్టం ఎంత పెద్దదైనా.. అందులో నీ ఇష్టం చాలు.. అలసట అన్నది లేకుండా కష్టాన్ని ఎదిరిస్తా... కడవరకు నీకై నిరీక్షిస్తా....

జీవితం

చావుకి,పుట్టుకకి మధ్య ఓ చిన్న జీవితాన్ని ఇచ్చి... మోయలేనన్ని బాధ్యతల్ని ఇచ్చి.. మర్చిపోలేని బంధాల్ని ఇచ్చి.. నిలకడలేని మనసుని మనిషికి తోడుగా ఇచ్చి.. ఎన్ని ఆటలు ఆడుతున్నావయ్యా... భగవంతుడా!

...

నిత్యం నీ మనసు నాతోనే ఉన్నా.. నిన్ను అందుకోలేనంత దూరంలో నేనున్నా! నా తోడుగా నువ్వు లేకున్నా.. నీ నీడగా నేనుంటున్నా! నా ప్రాణమే నువ్వనుకుంటూ... అనుక్షణం నిన్నే స్మరించుకుంటున్నా! నా తలరాతలో నువ్వుండాలని కోరుకుంటూ.. నీ తలపుల్లో జీవిస్తున్నా!

ఎండిందని నింపుకోవడానికి.. నిండిందని ఒలకబోయడానికి.. కాలంతోపాటు వచ్చే మేఘం లాంటిది కాదు  నా ప్రేమ.. ఎప్పటికి నీకోసం ఎదురుచూసే అంతులేని ఆకాశం లాంటిది నీపై నాకున్న ప్రేమ❤

...

నా గుప్పెడంత గుండెకి ఉప్పెనంత ప్రేమని పంచి నేను ఉప్పొంగిపోయేలా చేశావు.. మరి ఇప్పుడెందుకు నీ మాటలతో కన్నీళ్లు తెప్పిస్తూ.. నా మనసుకి ఊపిరాడకుండా ఉరి వేస్తున్నావు...

బాధ

బాధనెంత గుండెల్లో దాచుకున్నా.. కళ్ళల్లో పొంగే కన్నీటి కడలిని దాయగలమా?

ఆడపిల్ల

ఒక అడవిలో అందాల లేడిపిల్ల.. ముద్దుగా,అమాయకంగా ఉంటూ చెంగుచెంగున తిరిగేది.. అడవి అంతా తనలాగే స్వచ్చంగా ఉంటుందనుకునేది.. లేడిపిల్ల కదా! అడవిలో క్రూరమృగాలు ఉంటాయని గ్రహించలేకపోయింది.. అలా తిరుగుతూ ఉండగా ఒకసారి నక్క,తోడేలు కంట పడింది అమాయకపు లేడిపిల్ల.. తనకి సాయం చేసేకి వస్తున్నట్లు.. పైకి మంచిగా నటిస్తూ,విషాన్ని మనసులో నింపుకుని లేడిపిల్ల చెంతకు చేరాయి.. అభంశుభం తెలియని లేడిపిల్లకి తెలీదు అవి తనని అంతమొందించడానికి వచ్చాయని.. తెలిసిన క్షణంలో తనమదిలో తెలియని భయం,ఏమి చేయలేని నిస్సహాయత.. స్వేచ్ఛగా,సంతోషంగా తిరగాలి అనుకోవడం తప్పా... వాటిని మంచివాళ్ళు అని నమ్మడం తప్పా.. తన నమ్మకాన్ని వమ్ముచేస్తూ కపటంతో తనని అంతం చేసేకి వచ్చాయని తెలిసి కుమిలిపోయింది .. సమాజమనే అడవిలో లేడిపిల్ల లాంటి ఆడపిల్లల్ని వంచించేందుకు తోడేళ్లలాంటి మగ మానవ మృగాలు పొంచి ఉంటాయని ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాలి.. అడవిలో క్రూర మృగాల నుండి రక్షణకై ఎన్నో సంరక్షణ కేంద్రాలు ఉంటాయి.. మరి సమాజమనే అడవిలో లేడిపిల్ల లాంటి ఆడపిల్లని రక్షించుటకు ఏమున్నాయి? పుట్టుకనిచ్చే పుట్టుకనే అంతం చేస్తున్నారు.. ఆడదాని మానాన్ని అంగడిలో మాంస