ఆడపిల్ల

ఒక అడవిలో అందాల లేడిపిల్ల..
ముద్దుగా,అమాయకంగా ఉంటూ చెంగుచెంగున తిరిగేది..
అడవి అంతా తనలాగే స్వచ్చంగా ఉంటుందనుకునేది..
లేడిపిల్ల కదా!
అడవిలో క్రూరమృగాలు ఉంటాయని గ్రహించలేకపోయింది..
అలా తిరుగుతూ ఉండగా ఒకసారి నక్క,తోడేలు కంట పడింది అమాయకపు లేడిపిల్ల..
తనకి సాయం చేసేకి వస్తున్నట్లు..
పైకి మంచిగా నటిస్తూ,విషాన్ని మనసులో నింపుకుని లేడిపిల్ల చెంతకు చేరాయి..
అభంశుభం తెలియని లేడిపిల్లకి తెలీదు అవి తనని అంతమొందించడానికి వచ్చాయని..
తెలిసిన క్షణంలో తనమదిలో తెలియని భయం,ఏమి చేయలేని నిస్సహాయత..
స్వేచ్ఛగా,సంతోషంగా తిరగాలి అనుకోవడం తప్పా...
వాటిని మంచివాళ్ళు అని నమ్మడం తప్పా..
తన నమ్మకాన్ని వమ్ముచేస్తూ కపటంతో తనని అంతం చేసేకి వచ్చాయని తెలిసి కుమిలిపోయింది ..
సమాజమనే అడవిలో లేడిపిల్ల లాంటి ఆడపిల్లల్ని వంచించేందుకు తోడేళ్లలాంటి మగ మానవ మృగాలు పొంచి ఉంటాయని ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాలి..
అడవిలో క్రూర మృగాల నుండి రక్షణకై ఎన్నో సంరక్షణ కేంద్రాలు ఉంటాయి..
మరి సమాజమనే అడవిలో లేడిపిల్ల లాంటి ఆడపిల్లని రక్షించుటకు ఏమున్నాయి?
పుట్టుకనిచ్చే పుట్టుకనే అంతం చేస్తున్నారు..
ఆడదాని మానాన్ని అంగడిలో మాంసం లెక్క పీక్కుతినే రాబందుల మధ్య ఎలా బ్రతకాలి?
గడపదాటిన ఆడపిల్ల ఇంటికి చేరెవరకు ఏ మృగం ఎక్కడ దాడి చేస్తుందోనని చస్తూ ఇంకెన్నాళ్లు భయంతో బ్రతకాలి..
పసిపాప నుండి పండుముసలి వరకు వావి,వరస లేకుండా ఆడదానిపై అఘాయిత్యం చేసే మగ మృగాలని ఎందుకు వెంటనే శిక్షించరు?
చట్టాల్లో మార్పు ఎందుకు తీసుకురారు?
మీ ఇంటి ఆడపిల్లకు అన్యాయం జరిగేవరకు మీలో మార్పు రాదా?
ఆడపిల్లని అమ్మలా చూడకున్నా పర్లేదు..
దయచేసి
బొమ్మలా చూసి ఆడుకోకండి🙏

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం