Posts

Showing posts from January, 2020

బంధం

బంధం అనేది రెండు మనసుల మధ్య కోపంతో దూరం అయితే.. మళ్ళీ దగ్గర కాగలదు.. అదే బాధతో దూరమైతే ఎన్నటికీ కలవదు.. ఎందుకంటే... బాధని భరించే శక్తి మనసుకి ప్రతిసారి ఉండదు.. ఒకసారి గాయం అయితే అలాగే ఉండిపోతుంది..

😐

నా నిన్నటిలోని నీ స్థానం.. నేటి నా కన్నీటి జ్ఞాపకం.....

😑

కళ్ళ వెనుక కన్నీళ్ళని మౌనం వెనుక బాధని అర్థం చేసుకోగలిగితే ఏ బంధం బీటలు వారదు🙏

తనువుల మధ్య తపనకందని దూరం... నీ తలపులతో తరగని నా ఆలోచనలు వైనం.. తలవద్దని... తపనొద్దని ఎంతగా అనుకున్నా... తలుస్తున్నా నిన్నే నువ్వు కూడా తలవనంతగా❤

నువ్వెక్కడ జన్మించావో... నేనెక్కడ జన్మించానో.. మనిద్దరం కలిసి రేపు ఇంకెవరికో జన్మనిస్తామో.. తెలీదు కానీ... పరిచయంతో మొదలైన మన బంధం.. పరణయంగా మారి... నా ఊపిరి ఉన్నంతవరకు నీవెంట సాగాలన్నదే నా ఆశ❤

😑

నీతో పరిచయం నాకొక వరం అనుకున్నా.. కానీ.. ఆ పరిచయం ఖరీదు నా ప్రాణాన్ని సైతం వదులుకునేందుకు వెనుకాడనని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది

😊

ప్రతిరాత్రి కన్నీళ్లతో తడిసిపోయే దిండు కంటే.. గొప్ప ప్రేమగాథ మరెక్కడా ఉండదు...

వేలమందిలో నేనున్నా కూడా నన్ను వెంటాడే ఏకాంతం నువ్వు❤ నాకు నేను కూడా సొంతం కానివ్వని నా పంతం నువ్వు❤😘

మనసు

Image
తొలి సంధ్యలో లేలేత కిరణాన్నై నీ మది తలుపు తట్టాలని.. మలి సంధ్యలో నీలోని సగభాగంలా కలిసిపోవాలని.. ఏ దూర తీరాలైనా వెనుకడుగు వేయక నీతో నడవాలని.. కలలోనైనా.. ఇలలోనైనా నేను నీకే అంకితమవ్వాలని.. అనుక్షణం నిరీక్షిస్తుంది ఈ నా మనసు❤

బంధం

Image
నచ్చావన్న ఒకే ఒక్క మాటతో.. నీ ముందు తలవంచి మూడుముళ్ళు వేయించుకుని.. నీ దానిగా.. నీ తోడై ఉంటానని.. అందరిని కాదని.. నీకోసమే వస్తుంది.. తన బాధని అర్థం చేసుకో.. మనసులో పెట్టుకో.. కోపమొస్తే బుజ్జగించలేవా.. సర్ది చెప్పుకుని.. తప్పులు సరిచేయలేవా... నీకోసం బ్రతికే ఆ మనసు కోసం ఆ మాత్రం చేయలేవా.. ఎందుకు చిరాకు చూపిస్తావు.. కోపంతో మాట్లాడతావు..... తను బ్రతికే ప్రతిక్షణం నీకోసమే అని తెలియదా...

నీకోసం...

Image
నీడవైతే నీకోసం చీకట్లో బ్రతికేదాన్ని.. కలవైతే కలత నిద్రలో ఉండేదాన్ని.. ఊహవైతే అనుక్షణం నీ ఆలోచనలతో గడిపేదాన్ని... కన్నీరైతే తనివితీరా ఏడ్చేదాన్ని... కానీ.... నా ప్రాణమైపోయావు... నిన్ను విడిచి ఎలా ఉండగలను? ఊపిరే నువ్వయ్యావు.. ఎలా వదిలి బ్రతుకగలను.....

ప్రతిజన్మలో నీతో ఒక బంధం కావాలని.. ఏ జన్మలోను నేను తీర్చలేని ఋణానివై ఉండిపోవా... ప్రతిజన్మలో నాతో కలిసి ఉంటానని మాటివ్వవా.. ఎన్ని జన్మలైనా నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను ఇలా.... నీ బుజ్ జి కన్ నా❤

ప్రాణం

దూరం దగ్గరవుతున్న మనిద్దరి మధ్యలో.. ప్రేమ దూరమవడం చూస్తున్నా.. వెళ్ళిపోయె నిన్నువేనక్కి తీసుకువాలని నా మదిలో ఎంతో ఉన్నా.. నువ్వు నాకై చూపే ప్రేమకోసం ఆరాటపడుతున్నా.. విడిపోయేందుకు వంద కారణాలు కనిపిస్తున్నా... నీతో కలిసి బ్రతికే ఒకే ఒక్క ఆలోచనను నా మదినిండా నింపుకున్నా.. ప్రాణమే నేనంటున్నావు.. మరి నన్నెందుకు కలత చెందిస్తున్నావు... కన్నుల లోయలో కన్నీటి జలపాతాలు నిండినా.. చితి చేరే వరకు నిను వీడనని మాట ఇస్తున్నా...

😒

నీతో గడిపిన కొన్ని క్షణాల అంతులేని ఆనందాన్ని తలచుకుంటూ... కొన్ని యుగాలు మౌనాన్ని ఆనందంగా భరిస్తా.. నా మౌనంతో మాట్లాడే నీ మనసుని అనుక్షణం వెతుకుతూనే ఉన్నా.. అది నా మౌన భాషనే కాదు.. నా మదిలోని బాధని కూడా పంచుకుంటుందనే ఆశతో....