ప్రాణం

దూరం దగ్గరవుతున్న మనిద్దరి మధ్యలో..

ప్రేమ దూరమవడం చూస్తున్నా..

వెళ్ళిపోయె నిన్నువేనక్కి తీసుకువాలని

నా మదిలో ఎంతో ఉన్నా..

నువ్వు నాకై చూపే ప్రేమకోసం

ఆరాటపడుతున్నా..

విడిపోయేందుకు వంద కారణాలు

కనిపిస్తున్నా...

నీతో కలిసి బ్రతికే ఒకే ఒక్క ఆలోచనను నా

మదినిండా నింపుకున్నా..

ప్రాణమే నేనంటున్నావు..

మరి నన్నెందుకు కలత చెందిస్తున్నావు...

కన్నుల లోయలో కన్నీటి జలపాతాలు

నిండినా..

చితి చేరే వరకు నిను వీడనని మాట

ఇస్తున్నా...

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం