అమ్మ

అమ్మ ఈ పదం ఎంతో గొప్పది..
తన కన్నీళ్ళని దాచి నాకు నవ్వులు పంచింది..
అలిగితే బుజ్జగిస్తూ గోరుముద్దలు పెట్టింది..
దిగులుతో నేనుంటే తన ఒడి ఊయల ఊపింది..
మొండిలో బ్రతిమాలుతూ..
నా తప్పొప్పులు సరిచేస్తూ..
నా బంధం నుండి తప్పించుకుంటూ బాధ్యతలు నేర్పింది..
ఒంటరిగా వదిలి వెళ్తున్నా ఈ మృగాల మధ్య ఎలా ఉంటావో అంటూ కన్నీళ్ళతో నన్ను సాగనంపింది..
గుండెల్లో చెప్పుకోలేనంత బాధని కడవరకు మోస్తూ బ్రతకమని ఒక బంధాన్ని ఇచ్చి కనుమరుగైపోయింది..
నా అనే తోడు కరువై కన్నీళ్ళతో బ్రతికే నాకు తాను ఎక్కడో ఉంటూ కంటికి రెప్పలా కాచుకుంటుంది..
మళ్ళీ జన్మంటూ ఉంటే నాకు ఇలాంటి జన్మ ఇవ్వకమ్మా అంటూ కన్నీళ్ళతో అడుగుతున్నా..
నిజంగా దేవుడే ఉంటే..
గడిచిన కాలాన్ని ఇవ్వమని..
నా అమ్మను నాకు తిరిగి ఇవ్వమని బ్రతిమాలుతున్నా..
తన ఒడిలో బుజ్జయిలా నిదురపోవాలి..
నా గుండెల్లో మోస్తున్న భారాన్ని కన్నీళ్ళతో చెప్పుకోవాలని..
అనునిత్యం నా ఆలోచనల్లో కదులుతూ..
ప్రతిక్షణం నా కన్నుల తడిలో కనిపిస్తూ..
నను నడిపించే అమ్మానాన్నలకి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి..
ఈ కన్నీళ్లు ఎవరితో పంచుకోవాలి..
మీరేమో నన్నొదిలి ఎక్కడో ఉన్నారు..
కనీసం నా కన్నీళ్లు తుడిచేకి కలలోనైనా నీ చెయ్యి నన్ను తాకుతుందేమోనని ఆశతో..
బలవంతంగా కలత నిద్రపోతున్న..
కరుణించి ఒక్కసారైనా నన్ను గుండెకి హత్తుకోవచ్చుగా..
ఎందుకమ్మా..
నన్నొదిలి వెళ్లారు..
ఒంటరీదాన్ని చేశారు..
ఈ మృగాల మధ్య బ్రతకలేకున్నా..
ఒంటరిగా ఉంటే మీ దగ్గరికి వచ్చేస్తానేమోనని నాకో బంధాన్ని ఇచ్చి వెళ్ళారా..
నాలాంటి స్థితి ఏ ఆడపిల్లకు రాకూడదని కోరుకుంటూ..
మీతో గడిపిన ప్రతి క్షణాన్ని తలుచుకుంటూ..
కన్నీళ్ళతో నా మదిలోని భావాలను కలంతో కదిలిస్తూ..
ఎక్కడున్నా నన్ను నడిపిస్తారని,నాకు ధైర్యాన్ని ఇస్తారని ఆశతో.. 
ఏమి రాయాలో తెలియట్లేదమ్మా..
చాలా చాలా గుర్తొస్తున్నారు..
ఆ దేవుడిని ఎదిరించి నీ దగ్గరకి రావాలనిపిస్తుంది..
కానీ నన్ను రాకుండా ఇలా ఆపేశారు ఎలా భరిస్తూ,బ్రతకాలమ్మా..
చాలా కష్టంగా ఉందమ్మా..
కానీ బ్రతికేస్తా ఎలాగోలా..
నీ మాటలు,నీ ప్రేమ ,నీ జ్ఞాపకాలతో..
Miss U Amma❤
MothersDay🌹


Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం