కార్మిక దినోత్సవం

అవసరానికి ఆదుకునేవారులేక గనుల్లో పనిచేస్తూ..
తమ జీవితాల్ని పణంగాపెట్టి పొట్టనింపుకునే కార్మికులు..
ప్రపంచానికి ఆకలి తీరుస్తు తమ కడుపులు ఖాళీగా ఉంచుకుంటు..
రేయనకా,పగలనకా కష్టించి ఆఖరికి తమ తనువులి పుడమితల్లి ఒడిలో కలిపే కర్షకులు..
ఏ తల్లి ఏ చెత్తకుప్పలో పడేసిందో తన బ్రతుకు ఎంగిలివిస్తళ్లతో మొదలై..
మనసులేని రాతి మనుషులమధ్య రాళ్ళుమోస్తూ పొట్టనింపుకునే బాలకార్మికులు..
వీళ్ళందరి పెదవుల్లో నవ్వులు చిందినరోజే మనది అసలుసిసలైన భారతం..
మన ప్రతిపనిలో తాముంటూ..
తమ జీవితాలు అట్టడుగున చిదిమేసుకుంటున్న ప్రతి కార్మికుడికి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం