మాట మనసు

చెంపపై జారుతున్న ఒక కన్నీటి చుక్క మనసులో ఉన్న మాటని అడిగిందట..
నీకు బాధ కలిగినప్పుడు నువ్వు రాకుండా నన్నెందుకు బయటకి పంపిస్తావని...
అప్పుడు మాట ఇలా అనిందట..
కళ్ళల్లో నుండి కన్నీళ్లుగా నువ్వు బయట పడితేనే మనసు తేలిక అవుతుంది..
బాధగా ఉందని నేను పెదవి దాటితే ఎదుటిమనసు గాయపడుతుంది..
ఆవేశంలో,ఆలోచనలేని మాట కత్తి కంటే చాలా పదునైనది..
మనిషిని,మనసుని నిలువెల్లా చంపుతుంది..
అందుకే నేను రాకుండా నిన్నే పంపిస్తున్నానని చెప్పిందట..
మనసులో ఉన్న మాట ఎంత గొప్పదో కదా....

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం