కన్నవాళ్లు

కన్నబిడ్డ కాటుక కరిగేలా కన్నీరు కారుస్తుంటే..
మీరు కన్యాదానం ఎలా చేస్తారు?

మనసుకు నచ్చని వాడితో మనువుచేసి..
బంధానికి బలిచేసి..
మీ బాధ్యత తీరిపోయిందని ఎలా అనుకుంటారు?

మీ మీద గౌరవంతో..
మీ పరువుకి,మీ ప్రాణానికి విలువిచ్చి..
తను ప్రాణం అనుకున్నోడిని బలి చేసి..
తన జీవితాన్ని మీకు కానుకగా ఇచ్చి మీ రుణం తీర్చుకుంటుందే..
మీ పరువు కంటే తన మనసుకు నచ్చినవాడితో తన సంతోషమే ఎక్కువ అని మీకు ఎందుకు అనిపించదు?

మీరు తల ఎత్తుకు తిరగాలని..
మనసు చంపుకుని..
బ్రతికున్న శవంలా..
తలదించుకుని ఎవడితోనో తాళి కట్టించుకుంటుందే..
తన సంతోషాన్ని కాదన్నమనే బాధ మిలో ఉండదు ఎందుకు?

ఎన్నాళ్లీ పరువు?
ఎన్నాళ్లీ కులమతాలు?

గుండెల్లో పెట్టుకున్నాం లక్షలు అప్పుచేసైన అల్లుడిని కొనివ్వాలి అనుకోకండి..
నువ్వు కొనిచ్చే అల్లుడితో ఆడుకోవడానికి నీ కూతురు బొమ్మ కాదు..

తన మనసుకి నచ్చినోడితో పెళ్లిచేసి..
తన సంతోషంలో మీ అమ్మని చూసుకోండి..

అవును నిజమే ఇప్పుడున్న ప్రేమలు చాలావరకు కలిసి తిరగడం వద్దే ఆగిపోతున్నాయి..

అలాగని నీ కూతురిని అలాగే చూడకు..
ఒక్కసారి ఆలోచించి తనకి ఆనందాన్ని అందించు..

కూతురు ప్రాణం అంటారు ఎన్నెన్నో చేస్తారు..
నచ్చిన అబ్బాయిని ఇవ్వమంటే మనకులం కాదని ఆంక్షలు పెడతారు..

కన్నబిడ్డ సంతోషాన్ని కాదని చెప్పే కన్నప్రేమ ఎందుకు?

అందరిని కాదు నిజాయితీగా ప్రేమించే కొందరి జీవితాలైనా బాగుండెలా చేయమని నా విన్నపం😕😔

బుజ్జి😕

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం