రైతు

అన్నాన్ని కూడా ఆన్లైన్లో తెప్పించుకునే కాలంలో
మెట్టదున్ని మడినాటే రైతుల ఇక్కట్లు ఎవడికి కావాలి
పశుగ్రాసంలేక పశువులు అశువులుబాసి
పుడమితల్లి గొడ్రాలైపోతే ఎవడికి కావాలి
సారంకోల్పోయిన నేలకి
తడారిపోయిన ఆకాశానికి మధ్య నలిగిపోయే అన్నదాత ఆర్తనాదం ఎవడికి కావాలి😕
కావాల్సిందల్లా "ఓటు" కదా

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం