నీకై నేను
నానుండి జారిపోయిన క్షణాలవి
ఆత్రంగా పట్టుకోబోతే జారిపోయాయి
పోనీలే ఏరుకుందాం అనుకుంటే మరికొన్ని రాలిపోయాయి
రాలిపోయినవి ఏరుకోలేక
జారిపోతున్న వాటిని పట్టుకోలేక
సాగుతున్న నాపయనంలో
నిన్ను చూసాకే అర్థమైంది..
రాబోయే క్షణాలు
రాలిపోయిన క్షణాలని మర్చిపోయేలా చేస్తాయని!!
Comments
Post a Comment