✊
చేతులు లేనివాళ్లే రాతలు రాసుకుంటుంటే
కాళ్ళు లేనోళ్లే గమ్యాన్ని చేరుతుంటే
చేతలుఆపి రాతను తిట్టుకుంటావా
కదలకుండా కాలాన్ని నిందిస్తావా
అంగవైకల్యం లేకున్నా నీఆలోచనలకెందుకీ వైకల్యం
లే..
జీవితమనే కదనరంగంలోకి కదులు
నిన్ను వంచించిన విధిని వేటాడటానికి
నీబంగారు భవితకు బాటలు వేయడానికి!!
Comments
Post a Comment