అనంత గాథ - సీమ ఘోష

దశాబ్దాలుగా చినుకులకి తడవని నీ మేను..
మట్టివాసనెలా గుబాలిస్తుంది తల్లి...
రక్తం ఆవిరైపోతున్నా  మా ఆశలే ఊపిరై పోతుంటే..
నీ బిడ్డలకింత బువ్వ పెట్టేందుకు తపిస్తున్నావా సీమతల్లి...
కరువు బరువై..
గుండె చెరువై ఎండిన బీళ్ల సాక్షిగా..
నిన్నేలుతున్న నేతలకు లేదాయే కదమ్మా కాసింత మనస్సాక్షి..
అమ్మా...
అనంతమ్మా..
వసంతమే కరువాయే కదమ్మా ఈ సీమకు..
ఎండిన నీ గుండెలు బాధతో కాష్టంలా రగులుతునప్పుడు..
పొంగిన నీ దుఃఖం పెనుగంగగా ప్రవహిస్తున్నప్పుడు..
ప్రశ్నించే పిడికిల్లే బాణంలా ఎదురెళ్తాయప్పుడు..
ఉద్యమించే ధీరుడు వీధికొకడు ఉదయిస్తాడప్పుడు

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం