పెళ్లంటే...

బరువో,బాధ్యతో తెలియదు కాని
పెళ్లిచేసి బిడ్డను అప్పజెప్పి
చీరెసారెలతో సాగనంపి
గుండెబరువుపోయిందని ఊపిరి పీల్చుకుంటారు కొందరు
తర్వాత
"బాగున్నావామ్మా" అని ధైర్యంగా అడగలేని "నాన్న"
బాగున్నానని మాత్రమే చెప్పుతల్లి అని కళ్ళతో చెప్తూ ఆరాటపడే "అమ్మ"
పెళ్లంటే చేతులు దులిపేసుకోవడమా ఎప్పటికి అర్థంకాని ప్రశ్న😐
         -నందన✍

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం